జనవిజయంతెలంగాణప్రజాస్వామ్య తెలంగాణ కోసం బిజెపి పోరాటం చేస్తుంది

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బిజెపి పోరాటం చేస్తుంది

  • తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్రను మరచిన కెసిఆర్
  • తానే ఒంటరి పోరాటం చేశాన్న అహంకారంతో ఉన్నారు
  • గడీల పాలనతో తెలంగాణలో కటుంబం రాజ్యమేలుతోంది
  • ఏడేళ్ల తెలంగాణపై అభిప్రాయం వెలిబుచ్చిన లక్ష్మణ్

హైదరాబాద్, జూన్ 2(జనవిజయం): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతాపార్టీదే కీలక పాత్ర అని, అయితే దానిని పక్కన పెట్టి అంతా తానై తెలంగాణ సాధించానని సిఎం కెసిఆర్ చెప్పుకోవడం, అలాగే ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని బిజెపి జాతీయ నాయకుడు, ఒబిసి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తాము పార్టమెంటులో ఆనాడు మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కానీ కెసిఆర్ ఇప్పుడు ప్రజలు ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు బిజెపి ఎజెండాలోనే ఉందన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి వాజపేయి హయాంలో జార్ఖండ్, ఛత్తీన్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కానీ కెసిఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టి, నిరుద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోకుండా కుటుంబ పాలనకు తెరతీసారని అన్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే ఎక్కడికక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని బీజేపీ ఆలోచన మేరకే తమ పార్టీ ఆనాడు పార్లమెంటులో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మద్దతు తెలిపిందని కెసిఆర్ గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని జేఏసీలో బీజేపీ చేరింది. జాతీయ పార్టీగా జేఏసీలో కీలక పాత్ర పోషించింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, వంట వార్పు, రైల్ రోకోలు, బండ్లు, రహదారి దిగ్భందాలు ఇలా అన్నీ పోరాటాల్లో బీజేపీ నాయకులు ప్రధాన భూమిక పోషించిన విషయాన్ని కెసిఆర్ మరచిపోతే ఎలా అన్నారు. ఆనాటి జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరి తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామని, పార్లమెంట్ లో బిల్లు ఎప్పుడు పెట్టినా ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలందరమూ పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా తెలంగాణ అంశం పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష హోదాలో బీజేపీ నాయకురాలు దివంగత సుష్మస్వరాజ్ తెలంగాణకు మద్దతుగా తన గళాన్ని వినిపించిన విషయాన్ని కాదనగలరా? అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తానూ మొదటి నుంచి భాగస్వామిగా ఉన్నానని లక్ష్మణ్ అన్నారు. ఇలా తెలంగాణ అంతటా ప్రజా ఉద్యమాన్ని రగిలించడంలో బిజెపి ముందున్నదని, ఆనాటి ప్రజా ఉద్యమానికి తలొగ్గి అప్పటి యూపిఎ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. తద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. భారతీయ జనతాపార్టీ ఓటు వేయక పోయినట్లయితే తెలంగాణ కల సాకారమయ్యేదే కాదన్న విషయం గుర్తించి కెసిఆర్ పాలన సాగించాలని అన్నారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తూ ప్రజా ఆకాంక్షలను నెరవేరుస్తున్నదన్నారు.

తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతున్నామని అన్నారు. గడీల పాలన పోవాలన్నదే బిజెపి లక్ష్యమన్నారు. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని లక్ష్మణ్ అన్నారు. 1.5 లక్షల ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో నిరుద్యోగుల ఆశలు అడియాశల య్యాయి. ఉద్యమకారుడని అధికారం ఇస్తే గడీల పాలనను తిరిగి తీసుకువచ్చారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించేందుకు కృషి చేయడం లేదు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. కేసీఆర్ ప్రజాపాలన అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి పోరాడుతూ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తోందని లక్ష్మణ్ వివరించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి