అన్ని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలి
- తహశీల్దార్ నారాయణమూర్తి
- ఓట్ల చేర్పింపు వేగవంతం చేయండి
వేంసూరు, జూలై 22 (జనవిజయం):
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రెవిన్యూ అధికారులు, సిబ్బంది అన్ని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని తహశీల్దార్ నారాయణమూర్తి ఆదేశించారు.శనివారం మండల కార్యాలయంలోని తన ఛాంబర్ లో కార్యాలయ సిబ్బంది కు, నాయాబ్ తహశీల్దార్ కు, గిరిదావర్ లకు, విఆర్ఏలకు అత్యవసర సమావేశం నిర్వహించిన నారాయణమూర్తి మాట్లాడుతూ సుమారు మరో వారం రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని, పల్లెలో ఉన్న వాగులు, చెరువులు, కుంటలు ఎలా వున్నాయో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తుండాలని, చేపలు పట్టే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, లోతట్టు నివాస ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించాలని సమస్య వుంటే దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలలో శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శిధిల అవస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చాలని లేకుంటే వాటిలో నివాసం వుండే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు.
18 ఎండ్లు నిండిన పౌరులను నూతన ఓటరులుగా నమోదు చేయించే ప్రక్రియను, మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించే పనులను చేయాలని అన్నారు. కుల, ఆదాయ పత్రాల సంబంధించి సర్వర్స్ నెమ్మదిగా పని చేస్తున్నాయని, పూర్తిగా మొరాయిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నాయబ్ తహశీల్దార్ కరుణశ్రీ, గిరిదావర్లు హరిప్రసాద్, చిరంజీవి లు, జూనియర్, సీనియర్ సహాయకులు కిరణ్, జగదీష్ ,వి ఆర్ ఏ లు బింగి మహేష్, సునీత, లక్ష్మణ్, యాకూబ్, కృష్ణవేణి, కల్పన, రాజేశ్వరి, అజయ్, రహీం తదితరులు పాల్గొన్నారు.