— 12న ఖమ్మంలో పార్టీ అధినేత కెఏ పాల్ తో పార్టీ కార్యాలయం ప్రారంభం
— విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డి ప్రకాష్
ఖమ్మం, ఆగస్టు 9 (జనవిజయం) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాశాంతి పార్టీని ప్రజలకు చేరువులో ఉంచేందుకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డి. ప్రకాష్ అన్నారు.
బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ నెల 12న ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ లో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకే పథకాలు పెట్టి ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని తమపార్టీ ఆధ్వర్యంలో ఇతర దేశాల నుండి కొన్ని కంపెనీలను హైదరాబాదుకు పిలిపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకుగాను అక్టోబర్ 2న హైదరాబాదులో మీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం కో-ఆర్డినేటర్ విఠల్ కుమార్, జి నాగరాజు పాల్గొన్నారు.