జనవిజయంసాహిత్యంప్రజా చైతన్యంలో పాట పాత్ర కీలకం

ప్రజా చైతన్యంలో పాట పాత్ర కీలకం

  • పాటల రచయితకు సామాజిక బాధ్యత ముఖ్యం
  • ప్రముఖ గేయ రచయిత దేవేంద్ర, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్

ఖమ్మం కల్చరల్, జూన్ 11 (జనవిజయం): ప్రజా చైతన్యంలో పాట పాత్ర కీలకమని, పాటల రచయితకు సామాజిక బాధ్యత ఉండాలని ప్రముఖ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత కె.దేవేంద్ర, ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ పేర్కొన్నారు. ఖమ్మానికి చెందిన అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ వేదికగా గేయ రచన-మెళకువలు అనే అంశంపై జరిగిన సెమినార్లో వారు ప్రసంగించారు. తొలుత ఈ సెమినార్ ను దేవేంద్ర ప్రారంభించి ప్రసంగించారు. నాడు పాటలు రాశాకనే ట్యూన్ కట్టారని, నేడు ట్యూన్ కు అనుగుణంగా పాటలు రాస్తున్నారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజలతో పాట మమేకమై ఉందన్నారు. అనేక ఉద్యమాలకు పాట ఊపిరిలూదిందన్నారు. ప్రజల పక్షాన పాటలు రాసిన కవులు చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. అనంతరం సెమినార్లో పాట రచన-మెళకువలపై మౌనశ్రీ మల్లిక్ ప్రసంగించారు. పాట పుట్టుక, పాట రాయడమెలా, పాట గొప్పతనాన్ని వివరించారు. విశ్వంలో ఉన్న ప్రతి మనిషి దగ్గరకు పాట చేరుకుంటుందన్నారు. సాహిత్యంలో ఇతర ప్రక్రియలు ఆయా భాషల్లోకి అనువదిస్తేనే ప్రజలకు చేరవవుతాయన్నారు. పాట మాత్రం ఏ భాషలో ఉన్నా మదిని దోచుకుంటుందని పేర్కొన్నారు. పాట రాసే వారికి అనుభూతి చెందే హృదయం, అభివ్యక్తం చేసే భాష, స్పందించే గుణం, సామాజిక బాధ్యత ఉండాలని తెలిపారు. సుమారు మూడు గంటల పాటు సాగిన సెమినార్ లో పాట రచనపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అక్షరాల తోవ నిర్వహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, ప్రముఖ రచయిత వురిమళ్ల సునంద, ప్రముఖ వాగ్గేయకారులు కన్నెగంటి వెంకటయ్య, మేడగాని శేషగిరి, ప్రముఖ కవి అమృతవర్షిణి జయరాజు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి