ప్రజా రవాణా పై మంత్రి పువ్వాడ సమీక్ష
ఖమ్మం, జులై 20(జనవిజయం):
ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాతో పాటు సంస్థ ను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు..
గురువారం హైద్రాబాద్ లో రవాణా, మెట్రో, ఆర్టీసి సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం ఆర్టీసీలో కొనాగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు, వాటి నిర్వహణ, పనితీరు, ఇంకా సర్వీస్ లు అవసరం అయ్యే రూట్లు, రావాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో, రవాణా శాఖలో కొనసాగుతున్న ఆన్లైన్ సేవలు, వాటి నుండి వచ్చిన ఆదాయం, ఇంకా ప్రవేశ పెట్టతలచిన ఆన్లైన్ సేవలు తదితర అంశాలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.