జనవిజయంజాతీయంగోమూత్రం సేవిస్తే కరోనా దరిచేరదట మరోసారి ప్రగ్యా వివాదాస్పద వ్యాఖ్యలు

గోమూత్రం సేవిస్తే కరోనా దరిచేరదట మరోసారి ప్రగ్యా వివాదాస్పద వ్యాఖ్యలు

గోమూత్రం సేవిస్తే కరోనా దరిచేరదు
వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ వెల్లడి

భోపాల్‌,మే17(జనవిజయం): తాను గోమూత్రం సేవించడం వల్లనే కరోనా తన దరికి చేరదని బిజెపి వివాదాస్పద ఎంపి సాధ్వి ప్రగ్యాసింగ్‌ వెల్లడించారు. గోమూత్రం తాగడం వల్ల కోవిడ్‌ సోకదని ఆమె వ్యాఖ్యలు చేశారు. సోమవారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ మనం గోమూత్రం కనుక తీసుకున్నట్లయితే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఎలాంటి జబ్బులు రావు. గోమూత్రం రోజూ తీసుకునే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను రోజు తీసుకుంటాను కాబట్టే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కరోనా కూడా రాకపోవడానికి కారణం ఇదే. మనం ప్రతి ఇంట్లో ఒక గోవును తప్పనిసరిగా పెంచుకోవాలని అన్నారు. 2019 ఏప్రిల్‌లో, కాన్సర్‌ నయం కావాంటే గోమూత్రం తాగాలని సాధ్వి అన్నారు. అయితే దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయని కూడా ప్రగ్యా ఠాకూర్‌ ఇచ్చిన సలహా. తాను రోజూ గోమూత్రం తీసుకుంటానని అన్నారు. అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదట. అదీ సంగతి. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని ఆమె పేర్కొన్నారు. గోమూత్రం అపర సంజీవని ఆమె సెలవిచ్చారు. గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్‌ తగ్గిందని రెండేళ్ల క్రితం ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్‌ లో కోవిడ్‌ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంఅంతర్జాతీయంవ్యవసాయంసాహిత్యంస్పూర్తిప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంవీడియోలుజర్నలిజంవికాసంపర్యావరణంవినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలుఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంనేర వార్తలువార్త-వ్యాఖ్యఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలువీరమాచనేని డైట్ సలహాలుఎడిటర్ వాయిస్రాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి