Saturday, February 24, 2024
Homeరాజకీయంఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ-జగన్ భేటీ!

ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ-జగన్ భేటీ!

  • ప్రధాని మోడీతో సిఎం జగన్‌ భేటీ
  • ఎన్నికల ముందు గంటన్నరపాటు సుదీర్ఘ చర్చ
  • పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం
  • పోలవరం, నిధులు తదితర అంశాలపై చర్చించినట్లు సిఎంవో వెల్లడి

న్యూఢల్లీ,ఫిబ్రవరి9(జనవిజయం):

పోలవరం సహా నిధుల విడుదలకు సంబంధించి ఎపి సిఎం జగన్‌ ప్రధానిని కోరారు. ప్రధాని మోడీతో గంటన్నరపాటు భేటీ అయిన సిఎం సమస్యలతో పాటు తాజా రాజకీయాలపైనా చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిశారు. ఈ క్రమంలోనే పోలవరం నిధులు విడుదల చేయాలని సీఎం  జగన్‌ ప్రధాని మోడీని కోరారు. పోలవరం ప్రాజెక్టులో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండిరగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరినట్లుగా సీఎంవో తెలిపింది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.  ప్రధానమంత్రితో జరిగిన సమవేశాలు రాష్టాన్రికి చెందిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి.

2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్టాన్రికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండిరగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని  సీఎం కోరారు.  రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాథి అవకాశాలు ఏర్పాడతాయని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోవిూటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.  విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం- కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప విూదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా  చూడాలన్నారు. కడప – పులివెందుల, ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరారు.  ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. అలాగే  విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని కోరారు.

ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోనే సీఎం జగన్‌  పార్లమెంట్‌ లో సమావేశం అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు.  పార్లమెంట్‌ లోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు విూడియా ప్రతినిధులు మాట్లాడమని కోరినా సీఎం జగన్‌ స్పందించలేదు. పార్లమెంట్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్పటికే పీవీకి భారతరత్న ప్రకటించారు. దీనిపై స్పందించాలని కోరినా సీఎం పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పి వెళ్లిపోయారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌. ముందుగా పార్లమెంట్‌ భవనంలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. పెండిరగ్‌ బిల్లులు, విభజన హావిూలతోపాటు తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఏపీ అంశాల్ని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్‌. ప్రధానికి కొన్ని వినతిపత్రాలు కూడా ఇస్తూ వచ్చారు. ఐతే ఈసారి విూటింగ్‌ చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు సీఎం జగన్‌ ప్రధాని ఛాంబర్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌ కూడా అక్కడే ఉన్నారు. జగన్‌ వెళ్లిన కాసేపటికి మురళీధరన్‌ బయటకు వచ్చేశారు. హోమంత్రి అమిత్‌షా కూడా ఆ సమయంలో ప్రధాని ఛాంబర్‌లోనే ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ అయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments