జనవిజయంఅంతర్జాతీయంజగన్ ప్రభుత్వం ఏది చెపితే అది చేస్తా : ఆనందయ్య

జగన్ ప్రభుత్వం ఏది చెపితే అది చేస్తా : ఆనందయ్య

నెల్లూరు, మే23 (జనవిజయం) : తన మందు విషయంలో ప్రభుత్వం ఏది చెపితే అదే చేస్తానని ఆనందయ్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా రోగులకు తన మందు పంపిణీ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.

తన మందు నూటికి నూరు శాతం ఆయుర్వేదమేనని ఆనందయ్య నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని, వదంతులను నమ్మవద్దని ఆనందయ్య కోరారు. హెడ్మాష్టరు కోటయ్య విషయంలో కూడా తన మందు విషయమై వచ్చినవి పుకార్లేనని తేల్చి చెప్పారు. తన మందుపై ఆయుష్ వారు నిన్న అధ్యయనం చేశారనీ, ఐ.ఎం.ఆర్ బ్రుందం కూడా అధ్యయనానికి రానుందని తెలిపారు. వారి అధ్యయనం కూడా పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెపితే అది చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు. తాను ప్రజలకు మంచి చేసేందుకు మాత్రమే మందు తయారు చేశానని ఒక్కడిగా తయారు చేస్తే కొద్దిమందికే ఇవ్వగలననీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందరికీ ఇవ్వవచ్చన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానన్నారు.

కాగా ఈ విషయంపై ఎం.ఎల్.ఎ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి వచ్చాక ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని ఈలోగా లేనిపోని ఆరోపణలతో ప్రజల మనసులలో అనుమానాలు రేకెత్తించవద్దని కోరారు. ఆనందయ్య మందుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఈ ఆరోపణలన్నింటికీ, అనుమానాలన్నింటికీ త్వరలోనే నివ్రుత్తి అవుతాయన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ దయచేసి రాద్దాంతం చేయవద్దని హితవు పలికారు.

ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఈ మందును తయారు చేయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎం.ఎల్.ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఫార్మసీ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందయ్య మందును ఆయుర్వేద ఫార్మసీ నిపుణులు పరిశీలించారని తెలిపారు. ఆనందయ్య వాడే వనమూలికలు శేషాచల అడవుల్లో సంవృద్ధిగా ఉన్నాయన్నారు.  ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే మందు తయారీకి సిద్ధమవుతామని తెలిపారు.

ఏది ఏమైనా ఆనందయ్య మందుపై నిన్న జరిగిన వివిధ ప్రచారలకు సమాధానంగా కొంత స్పష్టత లభించింది. ఆనందయ్యకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఆనందయ్య మందును ఆపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన చెందిన వారికి కొంత ఊరట కలిగినట్లేనని భావిస్తున్నారు. అయితే ఐ.ఎం.ఆర్ అధ్యయనం కూడా త్వరగా పూర్తి చేస్తే ప్రస్తుత సంకట పరిస్థితిలో ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎదరుచూస్తున్నారు. అదే జరిగి అంతా సవ్యంగా నడచి ఆనందయ్య మందు తయారీకి అనుమతి లభించి కరోనాకు ఆ మందు సత్ఫలితాలనిస్తే ఆనందయ్య, క్రుష్ణపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలవడం ఖాయం.

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి