Thursday, October 5, 2023
Homeవార్తలువరద బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరి కాదు : బిజెపి నేత పొంగులేటి...

వరద బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరి కాదు : బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

భద్రాచలం జూలై 30 (జనవిజయం): వరద ముంపు బాధితుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని బిజెపి నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం స్థానిక బిజెపి నాయకుల తో కలిసి ముంపు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసేరు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ముంపు ప్రాంతాలలో పర్యటించి, బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు బిజెపి ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగం గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యావతి తో కలసి పొంగులేటి బృందం పర్యటించింది. బూర్గంపాడు ముంపు ప్రాంతాలను పరిశీలించి బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని పునరావాస బాధితులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎత్తైన ప్రాంతాలలో ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో కెసిఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.

అనంతరం భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంత నిర్వాసితులతో పునరావాస కేంద్రంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు మహిళలు తమకు సరైన భోజనం వసతి కల్పించడంలో తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు శాశ్వత ప్రాతిపదిక మీద ఆలోచన చేసి కరకట్ట నిర్మించకపోవడం వల్ల భద్రాద్రి వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంటికి పదివేల రూపాయలని మోసం చేశారని, భద్రాద్రి పట్టణాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు .వెంటనే యుద్ధ ప్రాతిపదికన శాశ్వత ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగా కిరణ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు సీతారాం నాయక్ ఎర్రం రాజు బెహరా యడ్లపల్లి శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్ మానుకోట పార్లమెంట్ కన్వీనర్ ముసుగు శ్రీనివాసరెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు పినపాక అసెంబ్లీ కన్వీనర్ ఉన్నం బిక్షపతి మొరంపల్లి బంజర సర్పంచ్ దివ్యశ్రీ బూర్గుంపాడు మండల అధ్యక్షుడు సాయి మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు బిజెపి జిల్లా కార్యదర్శి నాగబాబు భద్రాచలంపట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments