- సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్
భద్రాచలం, ఆగస్ట్ 30 (జనవిజయం): భద్రాచలం మండలంలో అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేరు. దరఖాస్తు చేసుకున్న చేతివృత్తుదారులందరికీ బీసీ బందు పథకం అమలు చేయాలని అన్నారు. కేవలం తూతూ మంత్రంగా సర్వే జరిపి రాజకీయ జోక్యంతో కొద్ది మందిని ఎంపిక చేస్తే మిగతా ప్రజలు అన్యాయం అవుతురాని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన అందరికీ అమలు చేయాలని ఆకోజు సునీల్ కుమార్ అన్నారు.
బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు కోసం ప్రజలు పోరాటాలుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బల్ల సాయికుమార్. మారెడ్డి శివాజీ .చాడ శోభన్ బాబు .కల్లూరి శ్రీరాములు. అయినాల రామకృష్ణ .తదితరులు పాల్గొన్నారు