Thursday, October 5, 2023
Homeవార్తలుప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలి

కలెక్టర్ ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం,జూలై 26 (జనవిజయం):

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, నాణ్యమైన విద్యాబోధన జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో విద్యా, మైనార్టీ, ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బిసి సంక్షేమ శాఖల అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల పాఠశాలల్లో విద్యాబోధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిల్లో అన్ని పాఠశాలలను పరిశీలన చేయాలని చెప్పారు.

ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలున్నాయో గుర్తించి నివేదికలు అందచేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం గత సంవత్సరం 246 ప్రాధమిక, 55 ప్రాధమికోన్నత, 67 ఉన్నత పాఠశాలలను మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపట్టిన 368 పాఠశాలల పురోగతిపై పర్యవేక్షణ ఇంజనీరింగ్ శాఖలు, విద్యాశాఖతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సమగ్ర నివేదికలు అందచేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

ఏఏ శాఖకు ఎన్ని పాఠశాలలు పర్యవేక్షణకు అప్పగించారు, పనుల పురోగతి తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం 1 నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమం అమల్లోకి వచ్చినందున ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసేందుకు ఉపాద్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థులు, ఉపాద్యాయులు ఇబ్బందులు పడకూడదని, ద్వి భాషా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో కనీస భాషా మరియు గణిత సామర్ధ్యాలను పెంపొందించడానికి తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

జిల్లాలోని 965 పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి చదువుతున్న 38110 మంది విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంచడానికి కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఈ విద్యాసంవత్సరం 72548 మంది విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్థులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే 47698 మంది విద్యార్థులకు 290205 నోటు పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు 154 ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా విద్యా, సంక్షేమ శాఖ అధికారులు వారి వారి పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలలు, సంక్షేమ హి హాస్టళ్లల్లో విద్యార్థులు హాజరు, నిర్వహణ తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, గురుకుల ఆర్సీఓ డేవిడ్ రాజు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, బిసి సంక్షేమ అధికారి ఇందిర, బిసి గురుకుల అధికారి జ్యోతి, ఎస్సీ గురుకుల కో ఆర్డినేటర్ వెకంటేశ్వరావు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments