జనవిజయంతెలంగాణకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలపై లెఫ్ట్ పార్టీల సమరభేరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలపై లెఫ్ట్ పార్టీల సమరభేరి

  • జూన్ 19న ఖమ్మంలో ప్రదర్శన, ధర్నా
  • 24న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన
  • 26న అంబేద్కర్ సెంటర్ లో మానవహారం 
  • 30న కలెక్టరేట్ ముట్టడి

ఖమ్మం, జూన్ 17 (జనవిజయం) : ప్రజలపై భారం మోపుతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సమరభేరి మోగించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. గురువారం నాడు సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో జరిగిన వామపక్షాల సమావేశంలో సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ఏడాదిలో 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపిందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కరోనా సంక్షోభంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారితే ఆదుకోకుండా భారాలు వేయటం సిగ్గుచేటన్నారు. ఒక్క నెలలోనే 25 సార్లు పెట్రో ధరలు పెంచిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. కరోనా కాలం నుండి పెంచిన పెట్రో ఛార్జీలన్నీ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో పెట్రోల్, డీజిల్ పై రు.12, రు.10 తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకం ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు తెగనమ్మి ఆడంబరాలు చేయటం అభివృద్ధి చర్య కాదన్నారు. ధనిక తెలంగాణలో 4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయో చెప్పాలన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక చర్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 19న ఖమ్మంలో ప్రదర్శన, ధర్నా 24న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన 26న అంబేద్కర్ సెంటర్ లో మానవహారం, 30న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎస్.కె.జానీమియా తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి