భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 19 (జనవిజయం) : తపాలా శాఖ స్కీముుల పై, పొదుపు ఖాతాల పై ప్రజల లో అవగాహన కలిగించుట కొరకు 5 రోజుల పాటు అన్ని పోస్ట్ ఆఫీసు ల లో ఉద్యోగులు మేళా నిర్వహించనున్నారు. భద్రాచలం ప్రధాన కార్యాలయం, భూపతి రావు కాలనీ, రామాలయం తపాలా కార్యాలయాల లో వివరాలు అందుబాటులో అందుబాటులో ఉంటాయని,సేవింగ్స్, రికరింగ్, టర్మ్ డిపాజిట్లు, సుకన్య సమృది మరియు ఇంకా అనేక పొదుపు ఖాతాల లో పొదుపు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని,ఈ కర్యక్రమ నిర్వాహకులు ఏ ఎస్ పి సుచెందర్, పోస్ట్ మాస్టర్ రామ్ మోహన్ రావు, ఏ పి ఎం ప్రసాద్రెడ్డి, భాస్కర శాస్త్రి మరియు శ్రీనివాస్ తెలిపారు.