జనవిజయంతెలంగాణపాజిటివ్ రేటును తగ్గించేందుకు మండల అధికారుల బృందం సమన్వయంతో పనిచేయాలి - ఖమ్మం కలెక్టర్ కర్ణన్...

పాజిటివ్ రేటును తగ్గించేందుకు మండల అధికారుల బృందం సమన్వయంతో పనిచేయాలి – ఖమ్మం కలెక్టర్ కర్ణన్ సూచన

ఖమ్మం, జూన్ 4 (జనవిజయం): గ్రామాలలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు మండల అధికారుల బృందం సమన్వయంతో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను అదేశించారు. రఘనాదపాలెం మండలం కోయచెలక, ఈర్లపూడి, ఐసోలేషన్ కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా ఉన్న గ్రామాలలో మండల ప్రత్యేక అధికారులతోపాటు మండలస్థాయి అధికారుల బృందం గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని పాజిటివ్ కేసులను గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని కలెక్టరు అదేశించారు. ఒక్కరి వల్ల కుటుంబంలో మిగిలిన వారికి పాజిటివ్ వ్యాప్తి చెందే ప్రమాదం వుందని దీనిపై అవగాహన కల్పించి పాజిటివ్ పెషంట్లను తప్పనిసరిగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని తహశీల్దారు, మండల అభివృద్ధి అధికారి, పోలీసు స్టేషన్ హౌస్ అఫీసర్, గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రతి గ్రామాన్ని సందర్శించి పాజిటివ్ కేసుల నమాచారాన్ని సేకరించాలని మండల స్థాయి అధికారులను కలెక్టరు అదేశించారు. ప్రధానంగా గ్రామాలలో పాజిటివ్ కేసులను తగ్గించేందుకు అనునిత్యం క్షేత్రస్థాయిలో వుంటు ఇండ్లలో సరియైన సదుపాయాలు లేనటువంటి పాజిటివ్ పేషంట్ల కుటుంబాలకు అవగాహన కల్పించి పాజిటివ్ పెషంట్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు ఉచిత వసతి బోజన సదుపాయాలను సమకూర్చి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టరు అదేశించారు. తద్వారా జిల్లాలో ప్రధానంగా గ్రామాలలో కొవిడ్ పాజిటివ్ రేటును పూర్తిగా తగ్గించగలుగుతామన్నారు. ఆ దిశగా అధికారులు నిరంతరం అప్రమతంగా వుంటు కుటుంబంలో ఎ ఒక్కరైన పాజిటివ్ తో ఉన్నట్లయితే వారి ద్వారా వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విధుల పట్ల అశ్రద్ధ నిర్లక్ష్యం వహిస్తే బాద్యులపై చర్యలు వుంటాయని ఈ సందర్భముగా కలెక్టరు హెచ్చరించారు. రఘనాదపాలెం తహశీల్దార్ జి.నరసింహరావు, ఎం.పి.డి.ఓ. అశోక్ కుమార్, మండల ప్రత్యేక అధికారి విజయకుమారి, స్టేషన్ హౌస్ అపీసర్ శ్రీనివాస్ యం.పి.ఓ.శ్రీదేవి, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు కలెక్టరు వెంట ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి