పొంగి పొర్లుతున్న వాగు-అప్రమత్తమైన అధికారులు
బోనకల్, జూలై 26(జనవిజయం):
మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామానికి చెందిన పెద్దవాగు గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పొంగి పొర్లి కల్వర్టు పైకి నీళ్లు రావడం జరిగింది.పొంగి పొర్లుతున్న వాగును మండల అభివృద్ధి అధికారి బోడెపుడి వేణుమాధవ్,ఏఎస్ఐ దారెల్లి బాలస్వామి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.కల్వర్టు పైకి నీళ్లు ఉధృతంగా రావడంతో వాహనాల యొక్క రాకపోకలు అధికారులు నిలిపివేశారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అక్కడ ఫ్లెక్సీను సమాచార నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీవో వేణుమాధవ్ మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉన్నందున వ్యవసాయ పని నిమిత్తం వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.