జనవిజయంజాతీయంపోరాడకుంటే నిరంకుశం దిశగా భారత్

పోరాడకుంటే నిరంకుశం దిశగా భారత్

  • అందరూ ఆ తానులో ముక్కలే – ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పాలకులు  
  • మోడీకి ప్రత్యామ్నయం ఏది? – ప్రజాస్వామ్యం ఘోరంగా విఫలం
  • ప్రజాస్వామ్యం కాదిది నిరంకుశం- అన్నింటా పాలకుల వైఫల్యం
  • మూగబోయిన జర్నలిజం – ప్రశ్నించలేని స్థితిలో కామ్రేడ్లు
  • అవినీతి మకిలతో ప్రతిపక్షాలు – మోడీ భజనలోనే బి.జె.పి నేతలు

దేశంలో కేంద్రంతో పాటు, అనేక రాష్ట్రాల్లో నిరంకుశ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పేరుకు మనది ప్రజాస్వామ్య దేశమైనా నిరంకుశ విధానాలే అమలవుతున్నాయి. ప్రజలు ప్రభుత్వాలను నిలదీసే రోజులు పోయాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రలు దోపిడీ కళ్లముందు కనిపిస్తున్నా, ప్రజలు హాహాకారాలు చేస్తున్నా… పేరుగాంచిన మోడీ కానీ, ఆయన ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో గానీ వాటిని నిలదీయడం లేదు. ప్రాణలు పోతున్నా పట్టించుకోవడం లేదు. లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేసి శవాలను ప్యాక్ చేసి పంపుతున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై నయాపైస వంతు అయినా చర్య తీసుకోవడం లేదు. ఓ వైపు కరోనా పంజా విసురుతోంది. మరోవైపు ధరలు దాడి చేస్తున్నాయి. వీటికి తోడు మోడీ ప్రభుత్వం పెట్రో, గ్యాస్ ధరలతో వాతలు పెడుతోంది. ఈ క్రమంలో ఆలోచిస్తే మనం నిజంగానే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా..? ఉంటే ఎందుకు నిలదీయలేకపోతున్నామో అర్థం కావడం లేదు.

కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరి ఆదివారానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం, బీజేపీ శ్రేణులు ఏడో వార్షికోత్సవ సంబరాలు జగలేదు. అయితే ఏడేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో ఘన విజయాలు సాధించిందని బీజేపీ నేతలు దండోరా వేసుకున్నారు. మరోవైపు మోదీ సర్కారు దేశానికి హానికరమని విపక్షాలు విమర్శించాయి. దేశంలో పటిష్టమైన విపక్షం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, మమతా బెనర్జీలు మాత్రమే అంతో ఇంతో మోడీని నిలదీస్తున్నాయి. అయితే మమతా బెనర్జీ, కావచ్చు కాంగ్రెస్ కావచ్చు.. అవినీతి మరక అంటకుండా ఉన్నవారు కాదు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ వారికి విశ్వసనీయత లేకుండా పోయింది. ఇకపోతే మమతా బెనర్జీ శారదా కుంభకోణంతో పాటు అనేకానేక కుంభకోణాల్లో కూరుకుని పోయింది. హిందువులపై దాడుల వంటి చర్యలతో మరకలను అంటించుకున్నారు. మరోమారు అధికారం నిలబెట్టుకున్నంత మాత్రాన సచ్చీలత ఉన్న నేతగా గుర్తించలేం. తెలంగాణ సిఎం కెసిఆర్ ఇక తానే ప్రత్యామ్నాయం అని ప్రకటించినా ఆయనకున్నమరకులు ఆయనకు ఉన్నాయి. అందుకే మోడీని ఎదిరించే సత్తాను కోల్పోయారని అంతా భావిస్తున్నారు. ఇకపోతే ఎపి సిఎం జగన్ పుట్టుకే అవినీతి పంకిలం కనుక మోడీని ఎదిరించి ఏ సాహసం చేయలేకపోతున్నారు. ఆయన ఎంతసేపు ప్రజలను తాయిలాలు వేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక వామపక్షాలు దేశంలో అసలు ఉనికన్నది లేకుండా పోయారు. అందుకే ఇప్పుడున్న నాయకుల్లో ఎవరు కూడా గట్టిగా మోడీని నిలదీయ లేకపోయారు.

అటు విపక్షంలో …ఇటు స్వపక్షంలోనూ మోడీకి తిరుగులేక పోవడంతో ఆయనో నియంతగా మారతున్నారు. తాను అనుకున్న మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన ప్రభుత్వం ఏడేళ్లలో ప్రజా ప్రయోజనార్థం చేపట్టిన చర్యలను, సాధించిన విజయాలపై ప్రధాని మోదీ ఆదివారం ‘వికాన్ యాత్ర’ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం, మోసం మరోటి ఉండదు. గుజరాత్ సిఎంగా ఉండగా పెట్రో ధరలను, జీఎస్టీని గుడ్డిగా వ్యతిరేకించి విమర్శలు గుప్పించిన మోడీ ఇప్పుడు అంతకు మించి వాతలు పెడుతున్నారు. తనకు తిరుగులేని విధంగా దేశ రాజకీయాలను మార్చుకున్న మోడీని సహజంగానే ఆయన మంత్రులు భజనపరులుగా మారారు. బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు చెబుతూ… మోదీ రైతుల జీవితాలనే మార్చేశారని, అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని రాజ్ నాథ్, జావడేకర్ సహా పలువురు మంత్రులు, బీజేపీ నేతలు కొనియాడారు. కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు కొవిడ్ సహాయ సామగ్రి అందజేస్తుంటే ప్రతిపక్షాలు ‘క్వారంటైన్’లో ఉంటూ దేశ నైతికతను దెబ్బ తీసేందుకు పనిచేస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఉండబోవు. కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో దేశాన్ని తాకట్టు పెట్టింది. అందిన కాడికి దోచుకుంది. ఇప్పుడు విమర్శలతో ముందుకు వస్తున్నా దానిని ప్రజలు నమ్మడం లేదు. సోనియా, రాహుల్, ప్రియాంక తప్ప ఆ పార్టీలో మరొకరు మనగలగలేని పరిస్థితుల్లో ఉంది. వారిచుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి మోదీ ప్రభుత్వం దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొనట్లు గానే ఉంది. ప్రభుత్వం ప్రతి రంగంలోనూ విఫలమైంది. ప్రజలను దారుణంగా మోసగించింది. ఇదే సందర్భంలో మోదీ సర్కారు ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడు తప్పులతో కూడిన చార్జిషీట్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కరోనాపై పోరులో ప్రభుత్వానికి సరైన విధానం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఏడో వార్షికోత్సవాన్ని బ్లాక్ డేగా మహారాష్ట్ర కాంగ్రెస్ అభివర్ణించింది.

నిజానికి ఇప్పుడు మోడీతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి పాలకుల బండారాన్ని బయట పెట్టడంలో విపక్షాలతో పాటు ఘనత వహించిన జర్నలిస్టులు కూడా విఫలం అయ్యారు. దేశంలో ఇప్పుడు జర్నలిజం చచ్చిపోయిందనే చెప్పాలి. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న వేళ నోరు మెదపక భీష్మాది కురువృద్ధులు మౌనం దాల్చడం వల్లనే ఆనాడా దారుణం చొటు చేసుకుంది. ఆనాడు నిండుసభలో ఇది అన్యాయమని ఏ ఒక్కరూ అడ్డుకోలేక పోయారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రతిఘటించలేక పోయారు. చివరకు కురుక్షేత్ర సంగ్రామం తప్పలేదు. ఆనాడు ఈ పెద్దల మౌనం కారణంగానే ఉపద్రవం ముంచుకుని వచ్చింది. ఇప్పుడు బిజెపిలో ఉన్న పెద్దల మౌనం కారణంగా దేశం మూల్యం చెల్లించుకుంటోంది. వీరంతా దేశం బాగుందన్న, ప్రజలు బాగున్నారన్న, ఆర్థిక స్థితి బాగుందన్న అతి ప్రచారాన్ని చూస్తూ ఊరుకుంటున్న తీరు సరికాదు. మోడీ చెప్పినట్లుగానే అభివృద్ధి సాధిస్తే దేశం తిరోగమన దిశగా ఎందుకు పరుగెడుతుందన్నది అర్థం కాని ప్రశ్న. దేశం ఆర్ధికంగా బలంగా ఉందంటే ధరలు ఎందుకు పెరిగాయి. ద్రవ్యోల్బణం ఎందుకు కలవరపెడుతోంది. నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది. రైతులకు ఎందుకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ప్రజలకు కనీస వైద్య సేవలు అందడం లేదు. ఎందుకు ఇంకా సమస్యలు వెన్నాడుతున్నాయి. అన్న దానికి సమాధానం లేదు. పాలకపక్షాలు విఫలం అయిన వేళ ప్రజలే విపక్షంగా గళమెత్తాలి. అన్యాయాలను నిలదీయాలి. అప్పుడయినా పాలకులు కళ్లు తెరుస్తారా అన్నది చూడాలి. ఎక్కడో ఒకచోట మొదలు పెట్టకపోతే దేశంలో సంక్షోభం తప్పదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి