పొంగులేటికి శుభాకాంక్షలు తెలిపిన బోనకల్ కాంగ్రెస్ నేతలు
బోనకల్, జులై 21 (జనవిజయం):
ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐసిసి టిపిసిసి ఎలక్షన్ కమిటీ కో చైర్మన్ నియమించారు. గురువారం టిపిసీసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి 25మందితో కూడిన రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చోటు దక్కింది.మొదటిసారి పదవి వచ్చిన తర్వాత సొంత జిల్లాకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మందాడపు తిరుమలరావు, ఉమ్మనేని కృష్ణ, భాగం నాగేశ్వరారావు లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.