Saturday, June 10, 2023
HomeUncategorizedఅన్నీ లబ్ది పొంది...పొంగులేటి ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా..?.....కోట రాంబాబు,జిల్లా నాయకులు....

అన్నీ లబ్ది పొంది…పొంగులేటి ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా..?…..కోట రాంబాబు,జిల్లా నాయకులు….

మీడియా సమావేశం జెడ్ పి చైర్మన్ లింగాల కమల్ రాజను తీవ్రస్థాయిలో విమర్శించిన జిల్లా నాయకులు కోట రాంబాబు

అన్నీ లబ్ది పొంది…పొంగులేటి ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా..?..కోట రాంబాబు,జిల్లా నాయకులు….

ఖమ్మం, ఏప్రిల్ 24(జనవిజయం):మధిర పట్టణంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జిల్లా నాయకులు ప్రముఖ డాక్టర్ కోట రాంబాబు ఆద్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం జెడ్ పి చైర్మన్ లింగాల కమల్ రాజను కోట రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో కోట రాంబాబు మాట్లాడుతూ., వైరా లోని పార్టీ బిఫాం ఇచ్చిన అభ్యర్థి కి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థికి సపోర్ట్ చేసి గెలిపించి పార్టీ వెన్నుపోటు పొడిచింది పొంగులేటి అని అంటున్నారు మరి ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు ఏమి చేశారని ప్రశ్నించారు. అంతే కాదు మళ్ళీ అదే అభ్యర్థిని పార్టీ లోకి ఎందుకు తీసుకున్నారని అన్నారు.

పొంగులేటి ని వెన్నుపోటు దారుడు అని అంటున్నారు ..మీరు అన్ని రకాలుగా పొంగులేటి ద్వారా లబ్ధి పొంది పొంగులేటి ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా..? అని ఎద్దేవ వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ద్వారా టికెట్ తెచ్చుకొని ఓడిపోయి మళ్ళీ జెడ్పీటీసీ గా కూడా పొంగులేటి ద్వారా టికెట్ తెచ్చుకొని గెలిచి జెడ్ పి చైర్మన్ అయినది నిజం కాదా అని ప్రశ్నించారు.పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీకి రాజీనామా చేసే ఎంపిటిసి లు, జెడ్పీటీసీ లు, సర్పంచ్ లు, సొసైటీ డైరెక్టర్ లు అందరూ పార్టీకి కాదు పదవులకు రాజీనామా చేయండి అని సవాల్ విసురుతున్నావు, లేదంటే వారు అందరూ కూడా చచ్చిన శవాలతో సమానం అనే మీ వర్ణన హాస్యాస్పదం గా ఉందని అన్నారు.

        మధిర మునిసిపాలిటీ లో కూడా వేరే పార్టీ గుర్తుల మీద గెలిచిన కౌన్సిలర్స్ ను రాజీనామా చేయకుండా మీ పార్టీ లో ఎలా జాయిన్ చేసుకున్నారని,మీరు చేస్తే సంసారం ఎదుటి వారు చేస్తే ఇంకోలా అన్నట్లు ఉంది మీరు మాట్లాడేది అని విమర్శించారు.ఎర్రుపాలెం మండలంలో ఐలూరి వెంకటేశ్వరరెడ్డి ని, జెడ్పీటీసీ కవిత ని పదే పదే టార్గెట్ చేయడం కాదని, వాడు వీడు అని మాట్లాడుతూ దిగజారుడు రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

ఈ ప్రెస్ మీట్ లో ఎర్రుపాలెం జెడ్పీటీసీ శీలం కవిత, దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కటికల సీతరామి రెడ్డి, గూడూరు రమణారెడ్డి, చావలి రామరాజు, తాండ్ర తిరుమలరావు, కపిలవాయి సత్యనారాయణ రాజు, సయ్యద్ అక్బర్, నరసింహారావు, నండ్రు విజయారావు, అక్కినపల్లి నాగేశ్వరరావు, సోమ రవికాంత్, తమ్మిషెట్టి బాలకృష్ణ , జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments