పినపాక, ఆగష్టు 10 (జనవిజయం): పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొదేం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ శ్తుళ్లూరి బ్రహ్మయ్య, అశ్వాపురం మండలం ఎంపీపీ ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.