Tuesday, October 3, 2023
Homeవార్తలుమా నేతకు నిద్ర పడుతుందో లేదో బెడ్రూంలో నువ్వు కాపలా కాసి చూసావా పొంగులేటి!

మా నేతకు నిద్ర పడుతుందో లేదో బెడ్రూంలో నువ్వు కాపలా కాసి చూసావా పొంగులేటి!

మా నేతకు నిద్ర పడుతుందో లేదో బెడ్రూంలో నువ్వు కాపలా కాసి చూసావా పొంగులేటి!

  • కాంగ్రెస్ నుండి సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు చెప్పే సత్తా మీకు ఉందా?
  • మా బిఆర్ఎస్ అభ్యర్థిగా సండ్ర
  • క్యాంప్ ఆఫీస్ లో నలుగురు అభ్యర్థుల్ని ఉంచి నడపగలవా?

సత్తుపల్లి,జూలై 23(జనవిజయం):

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సత్తుపల్లిలో జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొని చేసిన వ్యాఖ్యలను సత్తుపల్లి నియోజక వర్గ గులాబీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆదివారం సత్తుపల్లి లోని ఎమ్మెల్యే సండ్ర క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత గొర్ల సంజీవరెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు,ఆత్మ చైర్మన్ వనమా వాసుదేవరావు, పురపాలక సంఘం అధ్యక్షులు కూసంపూడి మహేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ నేతల సమావేశంలో నేతలు మాట్లాడుతూ మా నేత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు నిద్ర పడుతోందో లేదో ఆయన పడక గదిలో నీవు కాపలా కాసి చూసావా పొంగులేటి అని ప్రశ్నించారు.

సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్ధి పేరు చెప్పే సత్తా నీకు వుందా, నీ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నలుగురు అభ్యర్ధులను పెట్టీ నడప గలవా అని అన్నారు. మా బి ఆర్ ఎస్ పార్టీ సత్తుపల్లి శాసన సభ అభ్యర్ధిగా తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు, విమర్శించే స్థాయి నీకు లేవు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకం, కార్యక్రమం దేశంలోని ఏ ఒక్క రాష్ర్టంలో కూడా అమలు కావట్లేదని 2022 డిసెంబర్ వరకు కేసీఆర్ సర్కారును ఆకాశానికి ఎత్తిన నీవు స్వప్రయోజనాల కొరకు పార్టీ పిరాయింపు చేసి మాట మార్చటం ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దొర అంటున్నావు, నీ అంత అహంకారం, అహంభావం కలిగి ఎటువంటి ఒక హోదా లేకుండా నువ్వు అనుభవించిన అధికార దర్పం ఎవరు అనుభవించారో తెలంగాణ సమాజం చూస్తూనే ఉందని మా సండ్ర పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే పేదల పెన్నిధి అని అన్నారు. ఏ హోదాతో ఎస్కార్ట్ వాడినావు,ఏ హోదాతో ఇంటి దగ్గర గార్డ్స్ ను వాడినావు,ఏ హోదాతో నలుగురు అంగరక్షకుల ను వాడినావు అంతే కాకుండా స్కార్పియో వాహనం పెట్టి నలుగురు గన్ మెన్ లతో నువ్వు దొరతనాన్ని, దర్పాన్ని ప్రదర్శించిన తీరు ప్రజలు చూస్తూనే వున్నారని, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నమ్రతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజా సేవలో నిమగ్నమై వున్నారని తెలిపారు.

నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య సఖ్యత లేని వాడివి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా పొంగులేటి అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో వర్గ రాజకీయాలు చేసింది నీవని ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసనని, యస్.సి రిజర్వ్ నియోజకవర్గంలో మువ్వా విజయబాబు పాత్ర ఏమిటని ప్రశ్నించారు. కొండూరు సుధాకర్ అభ్యర్ధా? విజయ్ బాబు అభ్యర్ధా? కొండూరు సుధాకర్ కు రాజకీయం తెలియక విజయబాబు వెనకాల తిరుగుతున్నాడా? నీ శిష్యుడు శ్రీనివాస అని ఎద్దేవా చేశారు.

టిఆర్ఎస్ పార్టీ లో నువ్వు ఉన్నపుడు తుమ్మల నాగేశ్వరరావు వెంట మువ్వా విజయబాబు ఉన్నారని హాస్పటల్ ప్రారంభానికి మంత్రులను రానివ్వకుండా చేసి గ్రూపు తగాదాలు పెట్టి వర్గ రాజకీయాలు చేసింది నీవు కాదా అని ప్రశ్నించారు. బిజెపి పార్టీ నోట్లో తలపెట్టి వచ్చి,అమిత్ షా ను కలిసి చేతిలో చేయి వేసి, కార్యకర్తలతో సఖ్యత లేక గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో చేరి లౌకికవాద సూక్తులు చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది ఇది నీకు సమంజసమేనా ఆలోచించుకో అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ,వార్డు కౌన్సిలర్లు అద్దంకి అనిల్, గుండ్ర రఘు,నాయకులు మేకల నరసింహారావు, వేములపల్లి మధు,మిద్దె శ్రీను,పర్వతనేని వేణు, జొన్నలగడ్డ కృష్ణ,కంటే అప్పారావు, మహ్మద్ అబ్దుల్లా తదితరులున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments