ఖాకీ తీసేసి పింక్ డ్రెస్సులు వేసుకోండంటున్న రేవంత్

0
378
Share this:

 

కుత్భుల్లాపూర్ చౌరస్తాలో ప్రభుత్వ ప్రాపర్టీపై కే.టీ.ఆర్ బ్యానర్లు కట్టారు. ఎన్నికల ప్రచారం ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు. కే.సీ.ఆర్ ప్రభుత్వ అధికారులను, పోలీసులను అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారు. ఈ విషయంపై ప్రజాక్షేత్రంలోనూ కోర్టులలోనూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మల్కాజ్గిరి ఎం.పీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి పింక్ డ్రెస్ వేసుకోవాలంటూ పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎం.పీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రభుత్వ అధికారులే చేస్తున్నారని రేవంత్ అన్నారు. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్ధి కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్థత నెలొకొంది. ఆయనను కావాలని కుట్రపన్ని నామినేషన్ చెల్లదని అధికారులు చెప్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కనీసం అభ్యర్ధి వెంట అడ్వకేట్ ను కూడా రానివ్వలేదని, ఉమ్మడి రాష్ట్రమే నయంగా ఉందని ఓడిపోతామనే భయంతో అధికారులను అడ్డుపెట్టుకుని దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎం.ఎల్.ఏ కూన శ్రీశైలం గౌడ్ ఆరోపిస్తున్నారు. వివరాలు క్రింది వీడియోలో చూడవచ్చు.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.