Thursday, October 5, 2023
Homeవార్తలుపేకాట శిబిరంపై  టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి ..9 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై  టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి ..9 మంది అరెస్ట్

రూ.1,06,990/- నగదు, 7 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

పేకాట శిబిరంపై  టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి ..9 మంది అరెస్ట్
ఖమ్మం, 8 ఆగస్ట్( జనవిజయం  ):  పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేసినట్లు ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్య తెలిపారు. 
టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం రాత్రి  ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దతండ గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం రూరల్ ఎస్సై వెంకటకృష్ణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పేకాట అడుతున్న  9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.  వారి నుంచి రూ.1,06,990/- నగదు, 7 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments