జగ్గయ్యపేట కేంద్రం గా గంజాయి అమ్మకాలు
(9.3.2023,జనవిజయం)
జగ్గయ్యపేట లో గంజాయి అమ్ముతున్న నల్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ నుండి గంజాయి కొనుగోలు చేసి జగ్గయ్యపేట కేంద్రం గా చుట్టుపక్కల గ్రామాలకు కోదాడ ప్రాంతాలకు అమ్ముతున్న ఐదుగురి పై కేసు నమోదు చేశారు.
గంజాయి ని చిన్న చిన్న పొట్లాలలో కూర్చి చుట్టూ ప్రక్క గ్రామాల్లో ఈ ముఠా అమ్ముతునట్లు పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురి లో ఒకరు పరారీ లో ఉన్నాడని,అతన్ని త్వరలో పట్టుకుంటామంటున్నారు జగ్గయ్యపేట పోలీసులు. ఈ ముఠా లో రోహిత్ ప్రధాన నిందితుగా పోలీసులు పేర్కొన్నారు.గతం లోనూ గంజాయి అమ్మకం లో పలు కేసుల్లో ఈ ఐదుగురు నిందితులు ఉన్నారని,గంజాయి చైన్ లింక్ ను చెదిస్తామని పోలీసులు తెలిపారు.