- పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కవిత వెల్లడి
Clash between the two groups at the police station ho
బోనకల్,మార్చి 29 (జనవిజయం)
పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కవిత తెలిపారు.వివరాల్లోకి వెళితే వారం రోజుల క్రితం స్థానిక సీతానగరం నందు అనుమతులు లేకుండా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై ఆ వ్యక్తితో పాటు రావినూతలకు సంబంధించిన మరో వ్యక్తిని సదరు కర్ర వ్యాపారి అతని వెనుక ఉన్న వ్యక్తులు రాత్రిపూట మాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తావ అంటూ తిరిగి మళ్ళీ సరిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి చేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన విషయం బహిరంగంగా పలువురు వీక్షించడం కూడా జరిగింది.ఈ విషయం అంతటితో ఆగలేదు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో అక్రమంగా కలప రవాణా చేస్తున్న వారికి ఓపార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు అండదండలు ఉన్నాయంటూ దీనిపై ఫిర్యాదు చేసిన తమని చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు తెలియజేయడం జరిగింది. ఇది జరిగి గత రెండు మూడు రోజులు అవుతుంది. తాజాగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కలప వ్యాపారం పై చర్చించడానికి వచ్చిన వారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినీ ఒకరు నెట్టుకోవడం కూడా జరిగింది.అంతటితో ఆగలేదు పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని గొడవపడి కొట్టుకున్నట్లు స్థానికుల తెలిపారు.స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి వెంకటేశ్వర్లు అడ్డు వచ్చి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేయడం జరిగింది.కానీ అక్కడ ఓ వర్గానికి చెందిన వారు అతని బెదిరించి నెట్టివేసి విధులకు ఆటంకం కలిగించడమే కాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డస్ట్ బిన్,పూల కుండీలను కూడ ధ్వంసం చేశారు.విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు,స్టేషన్ పరిధిలో వస్తువులను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తేజావత్ కవిత తెలిపారు.తదుపరి విచారణ అనంతరం వారిని రిమాండ్ కు పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఇదిలా ఉండగా జరిగిన ఘటన పోలీస్ స్టేషన్ వద్దని తెలవడంతో స్థానికులు ఏ క్షణం ఏమవుతుందనీ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నట్లు వారు తెలిపారు.