Tuesday, October 3, 2023
Homeవార్తలుపోలీస్‌ పహారా మధ్య భూ సేకరణ సర్వే సరికాదు

పోలీస్‌ పహారా మధ్య భూ సేకరణ సర్వే సరికాదు

– అరెస్టు చేసిన భూ నిర్వాసిత రైతులను తక్షణమే విడుదల చేయాలి
– సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌
ఖమ్మం, ఆగస్ట్‌ 12 (జనవిజయం): ఖమ్మం జిల్లా పరిధిలోని రఘునాథపాలెం మండలంలో నాగపూర్‌ టు అమరావతి గ్రీన్‌ నేషనల్‌ హైవే పేరుతో పోలీస్‌ పహార మధ్య బలవంతపు సేకరణ చేపట్టడం సరైన కాదని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. తక్షణమే అరెస్టు చేసిన భూ నిర్వాసిత రైతులను మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రైతులతో చర్చించకుండా పోలీసులు అడ్డుపెట్టి సర్వే నిర్వహించటానికి వారు తప్పు పట్టారు. భూ సర్వేలో పోలీసుల జోక్యం మంచిది కాదన్నారు. తెల్లవారుజామున రైతుల ఇండ్లపైన బడి అరెస్టు చేయడం, కనపడ్డ వారిని ఎక్కడికక్కడే అరెస్టులకు పాల్పడడం ఏమిటన్నారు. నోటీస్‌ ఇవ్వకుండా ప్రైవేట్‌ ఏజెన్సీ సర్వే వాళ్లు, అధికారులకు రైతుల భూమిలోకి వచ్చే హక్కు వారికి ఎక్కడుందని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు, నేషనల్‌ హైవే అధికారులు రైతులతో సంబంధం లేకుండా వాళ్ళ భూముల్లోకి వెళ్లి కొలతలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. నేషనల్‌ హైవే అలైన్మెంట్‌ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని, అది ఖమ్మం నగర విస్తరణకు ఆటంకంగా ఉందని వారు అన్నారు. తక్షణమే అలైన్మెంట్‌ మార్పు చేయాలని అరెస్టు చేయబడ్డ రైతులను పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని వారు అన్నారు. రైతుల పట్ల నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీ ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమస్య పై పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన, పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని తెలియజేశారు.
పోతినేని సుదర్శన్‌ రావు ఖండన
గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులను అక్రమంగా అరెస్టు చేయటం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. సుదర్శన్‌ రావు ఒక ప్రకటనతో తీవ్రంగా ఖండిరచారు. ఖమ్మం అర్బన్‌ మండలంలో ఉన్న అనేక గ్రామాల నుండి  నేషనల్‌  హైవే నాగపూర్‌ టు అమరావతి జాతీయ రహదారి కోసం  రైతులు నుండి బలవంత భూసేకరణ చేస్తున్న అధికారులను అడ్డుకున్న భూనిర్వసితుల రైతులను, సీపీఎం పార్టీ జిల్లా నాయకులను అక్రమంగా అరెస్టు చెయ్యడం దారుణం అని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షలు పి.సుదర్శన్‌ రావు ఒక ప్రకటన లో తెలిపారు. భూ నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పైన కపట ప్రేమ  చూపిస్తున్నారని అన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న పంట భూములను కోల్పోతున్నారని ,వారికి వారి కుటుంబాలకు న్యాయం చేసి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని తన ప్రకటనలో కోరారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments