భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28(జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగలపల్లి, మొండి వర్రీ గ్రామాలకు చెందిన సాగుదారులకు పోడు పట్టాలు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నీ కోరారు. తమ భూములకు పట్టాలు అందలేదని ఆ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్ర వ్యాపితంగా పోడు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా తమకు రాలేదని రైతులు పేర్కొన్నారు. దీంతో రైతులు తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లి లో తుమ్మల నివాసానికి వచ్చి వారి సమస్యను విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం ఐటిడిఏ పిఓ తో ఫోన్లో మాట్లాడి పోడు పట్టాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. దీంతో స్పందించిన పిఓ త్వరలో పోడు పట్టాలు అందజేస్తామని తెలియజేసినట్లు రైతులు చెప్పారు