పిన్నీస్ సూత్రం ప్రాక్టీస్ చేద్దాం!

0
526
Share this:

 

క విషయంపై ఎక్కువ అవగాహన పొందాలన్నా, ఎక్కువ ప్రయోజనం పొందాలన్నా మనం చేయాలసిన పనిని మెరుగుపరచే టెక్నిక్ ఇది. ‘పిన్నీసు సూత్రం’ అనేది నేను పెట్టిన పేరు. మీ ఇష్టమొచ్చిన పేరుతో ఈ సూత్రాన్ని ఉపయోగించండి. అందరికీ తెలిసిందే. ఆచరణలో పెట్టడానికి మరోసారి గుర్తు (రివిజన్) చేసేందుకు ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందంతే.

మనం 20 మందిని ఒకచోట ఉంచి వారందరికీ పేపర్, పెన్ ఇచ్చి ఒక పిన్నీసు వలన ఎన్ని ఉపయోగాలున్నాయో వ్రాయమన్నామనుకుందాం. ఒక్కొక్కరు వారికి తెలిసిన ప్రయోజనాలు వ్రాస్తారు. ఇందులో వారు పిన్నీసుని ఉపయోగించినవి, చూసినవి, వారి ఊహకు వచ్చినవి వ్రాస్తారు. ఇలా వ్రాసినవాటిని అన్నింటినీ తీసుకుని ఎవరు ఎన్ని ఉపయోగాలు వ్రాశారన్నది లెక్క తీద్దాం. పిన్నీసుతో చేసే పనులను సగటున ఒక్కొక్కరు 15 పనులను వ్రాశారనుకుందాం. 20 మంది సమూహం కలిపి మొత్తం 300 ప్రయోజనాలను వ్రాస్తారు.

ఇందులో ఒకే ప్రయోజనాన్ని పలువురు వ్రాసే అవకాశం ఉంటుంది. పిన్నీసుతో కాలిలో గుచ్చుకున్న ముల్లును తీయవచ్చు, చొక్కా గుండీ ఊడినపుడు దానికి బదులుగా పిన్నీసును వాడవచ్చు.. వంటి ప్రయోజనాలను కొద్దిమంది కామన్ గా వ్రాసే అవకాశం ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ వ్రాసినవి, రిపీటెడ్ గా వచ్చినవి తీసేద్దాం. 20 మంది వ్రాసిన పిన్నీసు ప్రయోజనాల లిస్టులో ఇలా కామన్ గా వ్రాయబడిన ప్రయోజనాలని లెక్కించి వాటిని ఒకే ప్రయోజనంగా లెక్కగడదాం. విడిగా ఉన్నవి, కామన్ గా ఉన్నవి కలిపితే ఆ సంఖ్య 300 కంటే తక్కువగానూ, 15 కంటే ఎక్కువగానూ ఉంటుంది.

ఈ సూత్రం ద్వారా మనం నేర్చుకునే అంశమేమిటంటే ఓ విషయం పై నలుగురి అభిప్రాయాలు, అనుభవాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఒక్కరిగా తీసుకున్నదానికంటే ఖచ్చితంగా శక్తి పెరుగుతుంది. అంటే పిన్నీసు ప్రయోజనాలు వ్రాసిన లిస్టులో మనం ఉన్నామనుకుందాం, మనం వ్రాసిన సంఖ్య 12 అనుకుంటే, అందరినుండి వచ్చిన ఫలితం 50 అనుకుంటే మనకు అదనంగా 38 ప్రయోజనాల సంఖ్య తెలిసే అవకాశం కలుగుతుంది.

ఒక విషయం లేదా పని ప్రారంభించేముందు మనకు అన్నీ తెలుసులే లేదా మనకు తెలిసింది సరిపోతుందనే సహజధోరణిని కాస్త పక్కకు బెట్టి ఆ విషయంపై అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల మనం చేపట్టబోయే పనికి ఎక్కువ ఫలితం ఉంటుంది. పని చేయాల్సిన వారు సలహాల సారాన్ని బట్టి నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోకూడదు. ఎవరు ఏమి చెప్పినా వాటిలో ఏది మనం చేయగలం, ఏది మనకు ఉపయోగపడుతుంది అనేదానిని స్వంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్కం, పాజిటివ్ చర్చల ద్వారా మన నిర్ణయాత్మకశక్తి పెరుగుతుందనడంలో సందేహం లేదు. చర్చలలో పాల్గొనేవారికి ఆ అంశం లేదా పనిలో అవగాహన, అనుభవం ఉన్నవారై ఉండాలి. అన్నింటికీ అంటే ప్రతి విషయంలో ఒకే గుంపు పనికి రాదు.

– పల్లా కొండలరావు.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.