జనవిజయంతెలంగాణపి.జి మూడో సెమిస్టర్ పరీక్ష కేంద్రాల చేంజింగ్ ఆప్షన్ ఇవ్వాలి - ఎస్.ఎఫ్.ఐ

పి.జి మూడో సెమిస్టర్ పరీక్ష కేంద్రాల చేంజింగ్ ఆప్షన్ ఇవ్వాలి – ఎస్.ఎఫ్.ఐ

ఖమ్మం, జూన్5 (జనవిజయం): కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్, ఫోర్త్ సెమిస్టర్స్ నిర్వహించినట్లు విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్  పరీక్ష సెంటర్లు చేంజింగ్ ఆప్షన్ ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి జమ్మి అశోక్  డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎస్.ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ డిగ్రీ, పీజీ, కళాశాల దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి జమ్మి అశోక్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల కు థర్డ్ సెమిస్టర్ నిర్వహించబోతోందని ఈ క్రమంలో విద్యార్థులు సుదీర్ఘ ప్రయాణం చేసి పరీక్షలు రాసేందుకు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెప్పినట్లు చేయకుండా యూనివర్సిటీ అధికారులు ఎందుకోసం నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదన్నారు. విద్యార్థులు ప్రయాణంచేసి పరీక్ష సెంటర్లకు చేరుకోలేక ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తుందని ఆవేదన చెందారు. పేద మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేందుకే విద్యార్థులకు పరీక్ష సెంటర్లు చేంజింగ్ ఆప్షన్ ఇవ్వకుండా పిజి థర్డ్ సెమిస్టర్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తిం చేశారు. పరీక్ష కేంద్రాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తే విద్యార్థులకు కరెోనా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉన్నత అధికారులు ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థులకు పరీక్ష చేంజింగ్ ఆప్షన్ ఇవ్వాలని  డిమాండ్ చేశారు. థర్డ్ సెమిస్టర్ వ్రాయడానికి హాస్టల్ సదుపాయం లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఎలా విద్యార్థులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే ఎగ్జామ్స్ రాస్తారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనివర్సిటీ అధికారులకు పరీక్ష సెంటర్స్ చేంజింగ్ ఆప్షన్ ఇవ్వాలని కోరారు, కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గోపి, అనిల్, సునీల్, శ్యామ్, నాగరాజు, అవినాష్ , జగదీష్, అనిల్ , తదితరులు పాల్గొన్నారు
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి