జనవిజయంఆర్ధికంపెట్రోలు, డిజిల్ ధరలను నిరసిస్తూ బంకులో క్రికెట్ ఆడి వినూత్న నిరసన తెలిపిన డి.వై.ఎఫ్.ఐ

పెట్రోలు, డిజిల్ ధరలను నిరసిస్తూ బంకులో క్రికెట్ ఆడి వినూత్న నిరసన తెలిపిన డి.వై.ఎఫ్.ఐ

  • బ్యాట్ లేకుండా సెంచరీ కోట్టిన మోడి- డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
ఖమ్మం,జూన్ 8(జనవిజయం): పెంచిన పెట్రోలు డిజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ)ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో సెంచరీ దాటిన పెట్రోలు ధరలు అంటూ నిరసనగా స్థానిక పెట్రోలు బంక్ లో క్రికెట్ ఆడి నినాదాలు ఇస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మోడీజి బ్యాట్ లేకుండా సెంచరీ కొట్టాడని ఆయన ఎద్దేవా చేశారు. వీరబాదుడు భాది ప్రజలపై భారాలు మోపుతున్నాడని అన్నారు. వెంటనే పెంచిన పెట్రోలు డిజిల్ ధరలను తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ మాట్లాడుతూ ఉద్యోగులు పెరిగిన రెట్లతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని నిత్యావసరాల వస్తువులు, పెట్రోలు డిజిల్ సామాన్యులకు అందరికీ అందుబాటు ధరలో ఉండేలాగా ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ తో పాటు నాయకులు గుమ్మా ముత్తారావు,రంజిత్ కుమార్, భూక్యా ఉపేందర్ నాయక్, సత్తెనపల్లి నరేష్, కూరపాటి శ్రీను, కణపర్తి గిరి, రావులపాటి నాగరాజు, యాటా రాజేష్, అనిల్, వ్యకాస నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు ముళ్ళపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి