జనవిజయంఆంధ్రప్రదేశ్పేర్ని నాని రాజీనామాకు డిమాండ్

పేర్ని నాని రాజీనామాకు డిమాండ్

ఒంగోలు, మే 19 (జనవిజయం): కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో జర్నలిస్టుల సంక్షేమాన్ని, ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రాజీనామాకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. వర్కింగ్ జర్నలిస్టులందరినీ ప్రభుత్వం కరోనాపై సాగిస్తున్న పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించటంతో పాటు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలంటూ సీఎం జగన్‌కు రాసిన బహిరంగ లేఖను విడుదల చేసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి 50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఏపీలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం కరోనా వాక్సినేషన్ ప్రాధాన్యత క్రమంలో చేయించాలని ఏపీయూడబ్ల్యూజే లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోకపోగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మీడియా సంస్థలపై కేసులు పెడుతోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్‌లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా ఇంత వరకూ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, సెకండ్ వేవ్‌లో మరో 70 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన సమాచార శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదని, జర్నలిస్టులకు సీఎం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో కరోనా వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు కూడా లభించని దయనీయ స్థితిలో జర్నలిస్టులు ఉన్నారన్నారు. ‘‘జర్నలిస్ట్‌లను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి. కరోనా మొదటి వేవ్‌లో చనిపోయిన జనరలిస్ట్‌లకు ప్రభుత్యం ప్రకటించిన 5 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలి. రాష్టంలో వున్న జర్నలిస్ట్‌లకు వారి కుటుంబ సభ్యలకు వాక్సినేషన్ వేయంచాలి. కరోనా సెకండ్ వేవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు వారి కుటుంబాలనూ ఆదుకోవాలి. రాష్టంలో జర్నలిస్ట్‌లు కరోనావైద్యం చేయించుకొనేందుకు ప్రభుత్య ప్రవేటు వైద్యశాలలో పడకలు కూడా లభించని దయనీయ స్థితిలో వున్నారు. ప్రభుత్యం ప్రత్యేక బెడ్స్‌ను, ప్రత్యేక అధికారులను నియమించాలి.’’ అని సుబ్బారావు తమ యూనియన్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

‘‘ఈ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు. కరోనా మొదటి వేవ్‌లో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ, సెకండ్ వేవ్ విజృంభించి మరింత మంచి వర్కింగ్ జర్నలిస్టులను పొట్టనపెట్టుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి