జనవిజయంతెలంగాణరోజూ వంద కోవిడ్ టెస్టులు చేయాలి- మంత్రి పువ్వాడ

రోజూ వంద కోవిడ్ టెస్టులు చేయాలి- మంత్రి పువ్వాడ

ఖమ్మం,మే19(జనవిజయం): ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు వంద కోవిడ్ రోగ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో ప్రజలు అధిక సంఖ్యలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల కొరకు వేచియుండగా రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అలసత్వం వహిస్తున్న వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టుల కోసం ఉదయం నుండి వేచియున్న ప్రజలకు త్వరగా పరీక్షలు నిర్వహించి పంపాలని, వారికి కనీస సదుపాయాలు నీడ, మంచినీటి వసతి కల్పించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజూ వందమందికి తప్పనిసరిగా టెస్టులు చేయాలని, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని మంత్రి ఆదేశించారు. ఉదయం సకాలంలో విధులకు హాజరుకాని వైద్యాధికారిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని మంత్రి ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు జరుగుతున్న ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతిరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తప్పనిసరిగా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ శర్మ మంత్రి వెంట ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి