Tuesday, October 3, 2023
Homeవార్తలుపెండింగ్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి

పెండింగ్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి

పెండింగ్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి

  • విలేకరుల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఆవేదన

ఖమ్మం, జూలై 24 (జనవిజయం):

జిల్లా వ్యాప్తంగా 2018-19, 2020-21లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ రుణాలు గత 5 సంవత్సరాలుగా మంజూరు చేయలేదని, నిధులు మంజూరు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం అవుతామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలకు ఎంపికై 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 5 సంవత్సరాల క్రితం ఎస్సి కార్పొరేషన్ నిధులకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ లో ఎంపికయినా లబ్దిదారులను అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య లు చదివి కూడా ప్రభుత్వం అందించే ఎస్సి కార్పొరేషన్ నిధులు ఆసరా ఉంటదని ఆశపడి లక్ష రూపాయలు లోనుకు రూ.30 వేలు, 2 లక్షలకు 60 వేలు, 3లక్షలకు 90వేలు బ్యాంకు ద్వారా డిడిలు తీసి నిధులు మంజూరు అయితే వ్యాపారాలు చేసుకుందామని ఎదురు చూస్తున్న మాకు నిరాసే మిగిలిందన్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎస్సి కార్పొరేషన్ ఈడిని కలిసిన నిధులు మంజూరు కావడం లేదన్నారు. ప్రభుత్వం ఎస్సిలపై వివక్ష చూపుతున్నదని ప్రతి బడ్జెట్ లో అన్ని రంగాలలో ఉన్న వారికి నిధులు కేటాయించే ప్రభుత్వం మాపై ఎందుకు వివక్ష చూపుతుందన్నారు. అప్పులు తెచ్చి బ్యాంకు డిడి లు తీస్తే అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, ఇటీవల బిసి లకు రుణాలు మంజూరు చేస్తామని, లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారని, డబ్బులు లేకుండా ఈ ఊకదంపుడు మాటలు చెప్పే ప్రభుత్వం మాకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా నే జిల్లా వ్యాప్తంగా ఎస్సి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు అయి ట్రైనింగ్ పొందిన వారు అందరు ఏకమై జిల్లా లో నిధులు మంజూరు అయ్యో వరాకు ఆందోళనలు చేసేందుకు వెనుకాడబొమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లబ్ధిదారులు తడికమల్ల కృష్ణరావు, చెరుకుపల్లి నాగార్జున, ఖమ్మపాటి విజయ్, మాతంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments