భద్రాచలం, ఆగస్ట్ 13 (జనవిజయం): భద్రాచలం పట్టణ ప్రముఖులు, ప్రముఖ వ్యాపార వేత్త ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు(పెద్ద కాపు) గారి జీవితం ఆదర్శప్రాయం అని ఎమ్మెల్యే పొదేం వీరయ్య అన్నారు. మార్కెట్ లో వర్తకుల కు ఆయన చేసిన సేవలు మరువలేనివనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఆయన మరణం అందరికీ తీరని లోటని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు పెద్ద కాపు గా సుపరిచితులు అయిన వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, భద్రాచలం కాపు సంఘం నేత అడబాల వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున అన్న దాన కార్యక్రమం,
సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదకాపు అకాల మరణం చాలా బాధాకరమని అన్నారు. పలువురు నేతలు, వ్యాపార ప్రముఖులు పెద్ద కాపు కి ఘన నివాళులు అర్పించారు. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు (పెద్దకాపు) లేని లోటు భద్రాచలం నియోజకవర్గం కాపు కులానికి తీరనిదని అడబాల వెంకటేశ్వర రావు అన్నారు. వారి లో ఉన్నటువంటి సహాయ సద్గుణాలను పునికి పుచ్చుకొని అందరూ ముందుకి సాగాలని కోరారు. వారు కాపు సంఘ అభివృద్ధికి చేసిన కృషిని ఆయన గుర్తుచేసారు. చెవిటి, మూగ విద్యార్దులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత పుత్రులు సినిమా దర్శకులు తాండ్ర వెంకట రమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బుడగం శ్రీనివాసరావు, చింతిర్యాల రవికుమార్, సరెళ్ళ నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.