పేద విద్యార్ధినికి లాప్ టాప్ ని అందించిన కలెక్టర్
- బహుకరించిన మిత్ర ఫౌండేషన్ కు అభినందనలు తెలిపిన కలెక్టర్ గౌతమ్
ఖమ్మం, జూలై 20(జనవిజయం):
ఎస్బిఐటి లో ఇసిఇ 3వ సంవత్సరం చదువుతున్న వి. వెంకటాయపాలెం కు చెందిన పేద విద్యార్థిని టి.అఖిల కు మిత్ర ఫౌండేషన్ వారు సమకూర్చిన లాప్ టాప్ ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గురువారం ఐడిఓసి లోని కలెక్టర్ చాంబర్ లో అందజేశారు. మిత్ర ఫౌండేషన్ సేవలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్, కార్యదర్శి రంగా శ్రీనివాసరావు, చారుగుండ్ల రవి, యుగంధర్, పాలవరపు శ్రీను, నాగసాయి నగేష్ తదితరులు ఉన్నారు.