వైరా, ఆగష్టు 11 (జనవిజయం): వైరా మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని లీలా సుందరయ్య నగర్ వాస్తవ్యులు వేమూరి సత్యనారాయణ, స్వరూపరాణి దంపతుల కుమారులు వేమూరి సుదీర్ (యుఎస్ఎ), అజయ్ సౌజన్యంతో స్థానిక నిరుపేద విద్యార్థి గుత్తా దినేష్ కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలి పనులు చేస్తూ జీవిస్తున్న పేద కుటుంబం గుత్తా రమణయ్య, పద్మజ దంపతులు కుమారుడు దినేష్ ఇంటర్మీడియట్ బైపిసి గ్రూపులో ప్రతిభ కనబరిచి 890 మార్కులు సాధించాడు. తదుపరి ఉన్నత విద్య బి పార్మసి చదవడానికి వేమూరి సత్యనారాయణ, వేమూరి స్వరూపరాణి దంపతులు శుక్రవారం 10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రద్ధగా చదువుకుని మంచి స్థాయికి రావాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, కోటేరు శివారెడ్డి, కోటేరు మాధవి, మిట్టపల్లి నాగభూషణం, గుత్తా పద్మజా, గుత్తా దినేష్ తదితరులు పాల్గొన్నారు.