మెడికల్ విద్యార్థి హర్ష మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి!
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి!
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై విచారణ కమిటీ వేయాలి!
.నామాల ఆజాద్ పిడియస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్..
ఖమ్మం, ఫిబ్రవరి 26(జనవిజయం) :ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి బానోతు నవీన్ కుమార్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతు మృతి చెందారని,నిజామాబాద్ మెడికల్ కాలేజీ బాలుర హాస్టల్లో -ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హర్ష మృతిపై KMC ప్రీతి ఇలా వైద్య విద్యార్థుల వరుస ఆత్మ హత్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. స్థానిక ఖమ్మం నగరంలోని PDSU జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్యల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ విద్యార్థి హర్ష రాత్రి వరకు బాగానే ఉండి ఉదయం. అనుమానాస్పదంగా చనిపోవ డం జరిగిందన్నారు. హర్ష మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటన గురించి వివరాలు తెలుసుకుందామని మెడికల్ కాలేజీ హాస్టల్ సందర్శించిన విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించడం విడ్డూరమన్నారు. వరంగల్ కేఎంసి పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి పై వేధింపులకు పాల్పడిన సీనియర్ విద్యార్థి సైఫ్ నేను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేకూరే విధంగా ప్రీతి లాంటి ఘటనలు రావడం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో వరుసగా ఇటువంటి ఘటనలు జరగడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలన్నారు. ఈ వరుస మటనలపై వెంటనే విచారణ కమిటీ ని వేయాలన్నారు. జూనియర్ డాక్టర్లపై సీనియర్ డాక్టర్ల వేధింపులు-ఎక్కువవుతున్నాయని,ఆరోపణలు వస్తున్నాయన్నారు. మెడికల్ కాలేజీల్లో, అనుబంధ హాస్టల్లల్లో ర్యాగింగ్ ఘటనలు తరచుగా జరగడంపై పోలీసులు, ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. రాజకీయ ఒత్తిళు ప్రలోభాలకు లొంగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల వరుస ఉదంతాలు, ఆత్మ హత్యల ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్.
ఈ సమావేశంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు దీపిక జిల్లా కోశాధికారి లక్ష్మణ్,నాయకులు గణేష్, ప్రియాంక, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.