చర్లలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం వెంటనే చేపట్టాలి!
కళాశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి!
గోదావరి ముంపుకు గురిఅవుతున్న పేద ప్రజలకు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించాలి!
… పాయం సత్యనారాయణ,గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు..
భద్రాచలం 22 ఆగస్ట్( జనవిజయం) : ఏజెన్సీ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం డిగ్రీ కళాశాలకు చర్ల లో ప్రభుత్వం భూమి కేటాయించిందని, ఆ భూమి ఇప్పుడు ఆక్రమణ కు గురువుతుందని,వెంటనే అధికారులు చర్యలు చేప్పటి డిగ్రీ కళాశాల భవనాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ ఆధ్వర్యంలో చర్ల ఎం.ఆర్.ఓ కి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ., చర్ల డిగ్రీ కళాశాల కోసం ఎన్నో విద్యార్థి సంఘాలు మరియు రాజకీయ పార్టీలు పోరాటం చేశాయని, తత్ఫలితంగా కళాశాలకు ప్రభుత్వం కేటాయించిందని కానీ ఇప్పుడు ఆక్రమణకు గురవయ్యడం బాధాకరమని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగుచర్యలు తీసుకోవాలని అంతేకాకుండా కళాశాల భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
చర్ల మండలంలో గోదావరి ముంపుకు గురవుతున్న పేద ప్రజలు ఆందోళన చేస్తున్నారని..గోండ్వానా సంక్షేమ పరిషత్ పేద ప్రజల ఉద్యమానికి ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని తెలిపారు. గోదావరి వరదల ముంపుకు గురయ్యే పేద ప్రజలకు మెరక ప్రాంతంలో ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలాని ఈ సందర్భంగా పాయం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చిడెం గోపి,చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.