ప్రభుత్వ సంక్షేమ పథకాలను యువజన విభాగం గడప గడపకు తీసుకు వెళ్ళాలి
- బీఆర్ఎస్ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య
బోనకల్, జూలై 23(జనవిజయం):
ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్, బీ ఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు బోనకల్ మండలం యువజన విభాగ అధ్యక్షులు షేక్ నజీర్ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని గ్రామాల యువజన అధ్యక్ష కార్యదర్శులు సమావేశం బోనకల్ లో నిర్వహించడం జరిగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యువజన విభాగం నాయకులు నియోజకవర్గంలోని ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య అన్నారు.మండల బీఆర్ఎస్ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మధిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందని, నేటి యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నదన్నారు. ఎన్నికల సమయం వస్తున్న తరుణంలో మాయమాటలతో ప్రతిపక్షాలు బయల్దేరాయని, కల్ల బొల్లి మాటలతో మోసం చేయాలని చూస్తున్నారని, మాటలు నమ్మి మోస పోవద్దని సూచించారు.
యువజన విభాగం మధిర నియోజకవర్గ అధ్యక్షులు కూన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ప్రజల్లో లేనివాళ్లు ఎన్నికలంటే వచ్చేవాళ్లు ఇప్పుడు వస్తున్నారు.రాజకీయం అందరూ చేస్కోవచ్చు కానీ గత పదేండ్లుగా కన్పించని వాళ్లు ప్రజలకు దూరంగా ఉన్నవాళ్లు ఇప్పుడు వచ్చి అసత్య ప్రచారాలకు దిగుతున్నారు.ఈ ప్రచారం సోషల్ మీడియా వేదికగా విసృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టాలని సోషల్ మీడియా వారీయర్స్ అందరూ నిత్యం బీఆర్ఎస్ పార్టీ,సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ అధికారక సోషల్ మీడియా ఖాతాలతో పాటు, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు యొక్క సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని అన్నారు.
నిత్యం ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలి,పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం, లింగాల కమల్ రాజు , చేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికోట్టాలని సూచించారు.
మండల యువజన విభాగ కార్యదర్శిగా గుడిదే శ్రీరామ్ గౌడ్ ,ప్రచార కార్యదర్శిగా రామడుగు నరేష్, సంయుక్త కార్యదర్శిగా షేక్ యూసఫ్, ఉపాధ్యక్షులుగా నిమ్మతోట రవిలను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనింపు కృష్ణ చైతన్య,మధిర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కూన నరేందర్ రెడ్డి,మండల అధ్యక్షులు షేక్ నజీర్,మండల సోషల్ మీడియా అధ్యక్షులు మూడవత్ సైదా పాల్గొన్నారు.