Saturday, February 24, 2024
Homeపరిపాలనపురాతన భవనాలపట్ల ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పురాతన భవనాలపట్ల ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

  • ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం, ఫిబ్రవరి 9(జనవిజయం):

గ్రంధాలయం కూలిన సంఘటన పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శుక్రవారం నూతన కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలకు చేపట్టిన చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ భవనాలను ఆయా ఇంజనీరింగ్ శాఖలు నియతకాల తనిఖీలు చేపట్టాలన్నారు. భవనాల తనిఖీ సంబంధ రిజిష్టర్ నిర్వహించి, తనిఖీ అనంతరం రిజిస్టర్ లో రిమార్కులు పొందుపర్చాలన్నారు. తనిఖీల సందర్భంలో ఆయా భవనాల్లో వుండే శాఖల అధికారులకు భవనాల భద్రతపై సలహాలు, సూచనలు చేయాలన్నారు. వర్షపు నీరు భవనాల స్లాబ్, వెంటిలేటర్ ల వద్ద నిల్వకుండా ఉండేలా చూడాలని, తాయిలెట్ల లీకేజీలతో భవనం దెబ్బతింటుందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. భవనాల భద్రత, భద్రతలేని భవనాల కూల్చివేత, మరమ్మత్తులతో ఉపయోగంలోకి తేవడంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భవనాల నిర్వహణ చాలా కీలకమని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ శాఖలు తమ తమ పరిధిలోఎన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి, ఎన్ని కూల్చివేశారు, ఎన్ని పరమ్మత్తులతో వాటిని ఉపయోగంలోకి తేవచ్చొ నివేదిక సమర్పించాలన్నారు. కూల్చివేతకు నోటీసులు జారిచేసి, కూల్చివేతకు ఆర్థికభారం పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, పీఆర్, గిరిజన, విద్యా శాఖ ఇఇ లు పాండురంగ విఠల్, నాగశేషు, తానాజీ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా పశు సంవర్థక అధికారి వేణు మనోహర్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, కలెక్టరేట్ ఏవో అరుణ, షెడ్యూల్ సంక్షేమ శాఖ ఆర్సీఓ ప్రత్యూష, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments