జనవిజయంసాహిత్యంపరిశీలన, ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

పరిశీలన, ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

  • ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య, పోతగాని సత్యనారాయణ
  • అలరించిన బోథ్ గురుకుల పాఠశాల విద్యార్థుల కవితా గానం

ఖమ్మం కల్చరల్, జూన్ 13(జనవిజయం) : విద్యార్థులు తన చుట్టూ పరిసరాలను పరిశీలన చేయడం వల్ల సాహిత్యంలో సృజనకారులుగా ఎదుగుతారని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ రచయిత, బాలసాహితీవేత్త పోతగాని సత్యనారాయణలు పేర్కొన్నారు. ఖమ్మానికి చెందిన అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జూమ్ వేదికగా ఆన్లైన్ విద్య ఆవశ్యకత అనే అంశంపై జరిగిన బాలవాక్కు – కవి సమ్మేళనంలో విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు. తొలుత అల్లం రాజయ్య మాట్లాడుతూ ప్రతి వస్తువు గురించి ఆలోచించాలని, స్పందించాలని సూచించారు. ఏమి రాయాలి? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఈ రాసే విషయం ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? అనే విషయాలు గమనించుకుని రచన సాగించాలన్నారు.

అనంతరం ప్రముఖ రచయిత పోతగాని సత్యనారాయణ మాట్లాడుతూ సృజనాత్మకమైన, వికాసవంతమైన భావితరాన్ని అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన అక్షరాల తోవ సాహితీ సంస్థ విద్యార్థుల్లో సాహితీ సృజనను పెంపొందించడానికి చేస్తున్న కృషి అమోఘమైందన్నారు. సృజనరంగంలో ఉన్న వారందరికీ మానవత్వం ఉంటుందన్నారు. సమాజం మార్పులకు దారి తీసే విధంగా మనం ఆలోచించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ‘ఆన్లైన్ చదువులు అంతంత మాత్రం- క్లాసు రూమ్ చదువులు సాగవాయే’ అంటూ చాందిని పాడిన పాట అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు చదివిన కవితలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.సువర్ణలత, బెల్లంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, సమన్వయకర్త కిరణ్, అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, ఉపాధ్యాయులు పోతగాని మురళి, ప్రముఖ కవి కట్టెకోల చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి