జనవిజయంఆరోగ్యంపరిమితి విధించకుండా కోవిడ్ టెస్టులు జరగాలి - మంత్రి పువ్వాడ ఆదేశం

పరిమితి విధించకుండా కోవిడ్ టెస్టులు జరగాలి – మంత్రి పువ్వాడ ఆదేశం

  • కోవిడ్ టెస్టుల సందర్భంలో సరైన వసతులు కల్పించాలి
  • జిల్లాలో కోవిడ్ కు ఏ విషయంలోనూ కొరత లేకుండా చేశాం
  • ప్రయివేటు ఆసుపత్రులు సేవాభావంతో వైద్యం చేయాలని సూచన
  • ప్రజాప్రతినిధులు సేవచేయడానికి సిద్ధమన్న ఎం.పీ నామా
  • 10కేసులకంటే ఎక్కువ ఉన్న ప్రతి గ్రామంలో ఐసోలేషన్ ఏర్పాటు చేశామన్న కలెక్టర్
  • మూడవ విడత ఇంటింటి సర్వేకు రెడీ
  • పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్న సి.పి విష్ణు

ఖమ్మం, మే25 (జనవిజయం): జిల్లాలో పరిమితి విధించకుండా కోవిడ్ టెస్టులు జరగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడా రాములునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమీషనర్ విష్ణు.యస్. వారియర్ తో కలిసి కోవిద్ వైద్య చికిత్స, ర్యాపిడ్ టెస్ట్, 2వ డోస్ వ్యాక్సినేషన్, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, రెమిడెసివర్ ఇంజక్షన్ల లభ్యత, వైద్య సేవలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించి వైద్యాధికారులకు మరోసారి దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండవ విడతలో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే వల్ల జిల్లాలో కోవిడ్ ఉధృతిని కట్టడి చేయగలిగామని, మూడవ విడత సర్వే ప్రక్రియను కూడా పకడ్బందీగా త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వే బృంధాలకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ పంపిణీ చేయాలని, సర్వే బృంధాలు రోగ లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందిస్తూనే కోవిడ్ టెస్టులు కూడా నిర్వహించాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ప్రతి పి.హెచ్.సిలో తప్పనిసరిగా వంద టెస్టులు ప్రతిరోజు జరగాలని, జిల్లా ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పరిమితి విధించకుండా పరీక్షలకు వచ్చిన వారందరికి తప్పనిసరిగా ప్రతిరోజు కోవిడ్ టెస్టులు చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. పి.హెచ్.సి, సి. హెచ్. సిలలో టెస్టుల కొరకు వచ్చే వారికి కనీస వసతులైన నీడ, కూర్చునే సౌకర్యం, త్రాగునీటి వసతి తప్పనిసరిగా కల్పించాలని, ఎం.పి.డి.ఓలు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇట్టి సదుపాయాలను కల్పించే విధంగా వైద్యాధికారులు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ పేషెంట్ల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చామని, ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల సమస్య లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రధానంగా ప్రస్తుతం గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, మూడు వందల కంటే అధికంగా కేసులు నమోదైన మండలాలలో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలలో కరోనా కట్టడికి గాను ఇప్పటికే 10 కేసుల కంటే అధికంగా ఉన్న

గ్రామాలలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసామని, పేషెంట్లను అట్టి కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యుల సూచనల మేరకు టెస్టుల సంఖ్యను పెంచాలని, పరిమితి విధించకుండా టెస్టులు జరగాలని ఇంటింటి సర్వే సమయంలో రోగలక్షణాలు కలిగిన వారికి చికిత్సతో పాటు టెస్టులు కూడా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 వందల ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ జనరేట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంవల్ల జిల్లాలో ఆక్సిజన్ సమస్య లేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 3 వేల అడ్మిషన్లు జరిగాయని వాటిలో 2700 మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలిగామని ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ప్రయివేటు ఆసుపత్రులు కూడా సేవాభావంతో వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే ప్రయివేటు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామానాగేశ్వరరావు మాట్లాడుతూ వీలైనంత మేర ఎక్కువ టెస్టులు చేయడంవలన పేషెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులను కోవిడ్ బారీ నుండి కాపాడగలుగుతామన్నారు. జిల్లా ప్రధాన ప్రధాన ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అంబులెన్సులను నిత్యం అందుబాటులో ఉంచాలని, ప్రయివేటు అంబులెన్సులు అధిక పైకం వసూలు వలన సామాన్య ప్రజలకు ఆర్థిక భారం నుండి విముక్తి కల్గించాలని ఆయన సూచించారు. జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణ కట్టడికి మరింత పకడ్బంది చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో కేసుల అధికంగా నమోదైన మండలాలు, 10 కేసులు కంటే అధికంగా ఉన్న గ్రామ పంచాయితీలలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంట్లో సరియైన వసతి లేనటువంటి పేషెంట్లకు వైద్య సదుపాయంతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని ప్రస్తుతం 4 వందల మంది ఇట్టి ఐసోలేషన్ కేంద్రాలలో ఉన్నారని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ సూచనల ప్రకారం రెండు విడతల ఇంటింటి జ్వర సర్వే పూర్తి చేసుకొని 3వ విడత సర్వే చేపట్టామన్నారు.. జిల్లాలో ఆక్సీజన్, రెమిడెసివల్ ఇంజక్షన్ల సమస్య లేదని, ఆక్సిజన్ రీఫిల్లింగ్ కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వలన ఆక్సిజన్ సమస్య తీరిందని కలెక్టర్ తెలిపారు. ప్రయివేటు హాస్పిటలకు సంబంధించి డ్రగ్ స్టాకిస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇంటింటి సర్వే బృందాలకు టెస్టింగ్ కిట్స్ అందించామని, అన్ని బృందాల వద్ద పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచామన్నారు. పల్స్ పడిపోయిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమీషనర్ విష్ణు, యస్.వారియర్ జిల్లాలో లాక్ డౌన్ అమలు గురించి వివరిస్తూ జిల్లాలో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలవుతుందని, ప్రజలకు అవగాహన కల్పించి లాక్ డౌన్ సమయంలో అనవసర – జనసంచారాన్ని పూర్తిగా కట్టడి చేయడం జరిగిందన్నారు. పాస్ లేకుండా వచ్చే వాహనాలు, లాక్ డౌన్ సమయంలో అనవసరంగా తిరిగే వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 24 చెక్ పోస్టుల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, బెల్ట్ షాపుల నియంత్రణ క్టడి చర్యలు చేపట్టామని, ఇంజక్షన్లు బ్లాక్ దందాలకు సంబంధించి ఇప్పటికే 11 కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీసు కమీషనర్ తెలిపారు.

ఎన్. ఆర్. ఈ పేరెంట్స్ అసోసియోషన్, చిరాగ్ ఫౌండేషన్ ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అందించిన 15 ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్ లను ఈ సందర్భంగా మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి అందజేశారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్.మధుసూధన్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఏ.సీ.పీ ప్రసన్నకుమార్, ఐ.ఎం.ఏ సెక్రటరీ డాక్టర్ కూరపాటి ప్రదీప్, ఎన్. ఆర్.80 పేరెంట్స్ అసోసియోషన్ ప్రతినిధులు యలమద్ది వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, ఈ.మాధవరావు, పి.రాధకృష్ణ, టి.శ్రీకాంత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి