జనవిజయంఅంతర్జాతీయంపారాహుషార్! మరింత ప్రమాదకరంగా కరోనా ధర్డ్ వేవ్...!!

పారాహుషార్! మరింత ప్రమాదకరంగా కరోనా ధర్డ్ వేవ్…!!

  • వెల్లడవుతున్న మరిన్ని అధ్యయనాలు
  • సెకండ్‌వేవ్‌ ప్రమాదం ఎక్కువే అంటున్న నిపుణులు
  • థర్డ్‌వేవ్‌తో చిన్నారులకు ముప్పు తప్పదని హెచ్చరిక
  • కంటికి కూడా ప్రమాదమే అంటున్న వైద్యులు
  • చిన్నారుల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి
  • కేసులు,మరణాలలో రెండో స్థానంలో భారత్

న్యూఢల్లీ,మే 20(జనవిజయం): కరోనా ఫస్ట్‌ వేవ్‌తో పోల్చితే సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరమైనది. నిపుణులు చెప్పిన దానికన్నా అధిక రెట్లు కరోనా వేగంగా వ్యాపించింది. కోవిడ్‌-19 మరణాలు సైతం అధికంగా సంభవించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో కరోనా కేసులలో, మరణాలలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం తప్ప మహమ్మారిని అరికట్టేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కరోనా థర్డ్‌ వేవ్‌ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది.

కరోనా తొలి, రెండో వేవ్‌లలో టీనేజ్‌ దాటిన వారు, వయోజనులపై కోవిడ్‌-19 ప్రభావం చూపింది. అయితే మరికొన్ని నెలల్లో సంభవించనున్న కరోనా థర్డ్‌ వేవ్‌ 14 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటాయని చెబుతున్నారు. హార్వడ్‌ హెల్త్‌ ప్రకారం.. కొన్ని రోజులపాటు జ్వరం, దద్దుర్లు, కళ్లల్లో రక్తం తగ్గడం, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, డయేరియా, పగిలిన పెదవులు, పెదవులు ఎర్రబారటం, మెడ నొప్పి, కాళ్లు చేతుల వాపు, చికాకు, అతినిద్ర, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.పెద్దవారి మాదిరిగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ లేని కారణంగా తల్లిదండ్రులు, సంరక్షణకు చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యహరించాలి. కనుక పైన తెలిపిన కరోనా లక్షణాలు విూరు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

మరోవైపు చిన్నారులకు పోషకాహారం అందిస్తూ రోగనిరోధక శక్తి పెంచడానికి యత్నించాలి. కొన్ని అనారోగ్య లక్షణాలు చిన్నారులను నిమోనియా బారిన పడేందుకు దారితీస్తాయి. పెద్దవారిలో అయితే సమస్య సులభంగా గుర్తిస్తాం, కానీ చిన్నారులలో సమస్య ఏంటన్నది చెప్పకుండా బాధపడతారు, ఏడుస్తుంటారు. కనుక కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందు నుంచే తల్లిదండ్రు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి అనేక మార్గాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఒకరినుంచి మరొకరికి నోటితుంపర్లు ద్వారా వ్యాపించే కరోనా ఇప్పుడు గాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. అలాగే కంటి ద్వారా కూడా కరోనా సోకుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

కరోనావైరస్‌ కంటిద్వారా వ్యాపించడం ద్వారా కళ్లకు అత్యంత ప్రమాదకరమని కొత్త అధ్యయనంలో తేలింది. కరోనాతో కంటికి ముప్పు మాత్రమే కాదు.. కంటిలోని కణాలను తీవ్రంగా నాశనం చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. కరోనావైరస్‌ కంటి నుంచి శరీరంలోకి సులభంగా ప్రవేశించగలదని చెబుతున్నారు. వైరస్‌ కంటిలోని కణాలను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్‌ సైనాయ్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకుని వైరస్‌ శరీరంలోకి ప్రయాణిస్తుందని గుర్తించారు. కంటి ద్వారా వ్యాపించి కంటిలోని పై కణాలను నాశనం చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. కంటిలోని కణాలు నాశనం చేయడమే కాకుండా వైరస్‌ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కంటిలోని ముందు భాగమైన లింబస్‌ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితం అవుతుందని గుర్తించారు. అయితే కంటిలోని కార్నియాకు తక్కువ ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ముఖంలోని ప్రతి భాగం వైరస్‌ను శరీరంలోకి పంపేందుకు వాహకంగా మారుతుందన్నారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ముఖం భాగాన్ని తాకకుండా ఉండాలని సూచించారు. ఫేస్‌ షీల్డ్‌ వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి