Tuesday, October 3, 2023
Homeవార్తలునిజాంకు చెమటలు పట్టించిన పాపన్న గౌడ్ - గౌడ సంఘం ఆధ్వర్యం లో జయంతి...

నిజాంకు చెమటలు పట్టించిన పాపన్న గౌడ్ – గౌడ సంఘం ఆధ్వర్యం లో జయంతి సభ

భద్రాచలం, ఆగస్ట్ 18 (జనవిజయం): నిజాం, భూస్వామ్య, పేత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం భద్రాచలం ఏజెన్సీ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏజెన్సీ గౌడ సంఘం వ్యవస్థాపకులు బంధం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత న జరిగిన సభ లో కొన్నే లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద 370 సంవత్సరాల క్రితం నైజాం పాలకుల భూస్వాముల పెత్తందారుల గుండెల్లో గుణపమై నైజాం పాలకులకు సమటలు పట్టించి నైజాములను తెలంగాణ నుంచి తరిమికొట్టి గోల్కొండ కెలపైన బహుజనులకు నాయకుడుగా రాజ్యపాలన చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మరియు ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌడలందరు ఏకమైతే రాజ్యాధికారం నిర్ణయించే శక్తి గౌడలకు ఉందని అన్నారు మరియు బంధం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏజెన్సీలో బ్రాందీ షాపుల్లో గౌడలకి రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కాసుల శ్రీనివాస్ గౌడ్ మామిడి వెంకటేశ్వర్లు గౌడ్ గండి వెంకన్న గౌడ్ ఉర్లుగొండ వీరన్న గౌడ్ తలగాని రంగారావు గౌడ్ మురళి గౌడ్ సురేష్ గౌడ్ పని కుమార్ గౌడ్ 19 సాయి గౌడ్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments