వేంసూరు,ఆగస్ట్ 18(జనవిజయం): మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలోని వ్యాపార కూడలిలో గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మల్లెల్లి సత్యనారాయణ,పర్సా రాంబాబు మాట్లాడుతూ అతి సామాన్య గౌడ కుటుంబంలో జన్మించి పట్టుదలతో కేవలం 12 మంది సైన్యంతో ప్రారంభమై 12 వేల సైన్యంకు అధినాయకుడిగా ఎదగడమే కాకుండా 20 కోటలను జయించి చక్రవర్తిగా ఎదిగిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర,స్వయంకృషి పట్టుదల అంకితభావంతో పనిచేస్తూ ఏదైనా సాధించవచ్చానడానికి నిదర్శనమని ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ముందుగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి పుష్పాలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్సా అప్పారావు, మరీదు కేశవలు, పామర్తి అశోక్, చిలుకబత్తుల రాధాకృష్ణ, మురళి, జయబాబు, నరసింహారావు, మిద్దె జగన్, నాగేశ్వరరావు, గోపాలస్వామి, ముత్తారావు, మల్లెల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.