జనవిజయంఅంతర్జాతీయంపాక్ లో రెండు రైళ్లు ఢీ - కనీసం 30మంది మరణించినట్లు సమాచారం

పాక్ లో రెండు రైళ్లు ఢీ – కనీసం 30మంది మరణించినట్లు సమాచారం

ఇస్లామాబాద్, జూన్ 7 (జనవిజయం): పాకిస్తాన్ లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైలు రెతి, డహార్కి మధ్య మిల్లత్ ఎక్స్ పెన్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 40 నుంచి 50 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం గురించి సింధ్ లోని ఘోట్కి జిల్లా పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా మాట్లాడుతూ మిల్లత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొన్నదని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. రేడియో పాకిస్తాన్’ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులను నమిప ఆస్పత్రులకు తరలించారు. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు రేడియో పాకిస్తాన్ చెప్పింది. మిల్లత్ ఎక్స్ ప్రెస్ లోని 8 బోగీలు, సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఘోట్కీనమిపంలో డహర్కీ, రేతీ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ ఘటనలో కనీసం 40 మంది గాయపడ్డారని, ఘోట్కీ ఎస్ఎస్పీ వివరాల ప్రకారం 30 మంది వరకూ ప్రయాణికులు చనిపోయారని ఘోట్కీ డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా జియో న్యూనక్కు చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన భారీ యంత్రాలను ఘటనాస్థలం దగ్గరకు పంపించామని, అవి త్వరలో అక్కడికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి