జనవిజయంజాతీయంఅతిగా ప్రవర్తించి ఆగ్రహానికి గురై సస్పెండ్ అయిన కలెక్టర్

అతిగా ప్రవర్తించి ఆగ్రహానికి గురై సస్పెండ్ అయిన కలెక్టర్

ధికారం ఉంది కదా అతిగా ప్రవర్తిస్తే కలెక్టర్ అయినా చర్యలకు గురికాక తప్పదని చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిరూపించింది. పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా సరేే ప్రజలకు సేవచేయడానికి నియమితులైనవారు తప్ప ప్రజలపై వీధి రౌడీలుగా ప్రవర్తించడానికి కాదు. రాజ్యాంగంలో చెప్పిన మేరకు కాకుండా బ్రిటీష్ కాలం నాటి పోకడలు, భూస్వమ్య, పెత్తందారీ అహంకారాలు ప్రవర్తించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఎప్పటికపుడు జరుగుతూనే ఉంది. అధికారులందరూ అలా ఉంటారని కాదు గానీ ప్రజలకు సేవచేయాల్సిన ప్రబుత్వోద్యోగులు వారు చిన్నవారైనా, పెద్దవారైనా సరే మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఈ సంఘటన తెలియజేస్తోంది. చత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ కలెక్టర్ లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని శనివారంనాడు ఓ వ్యక్తిని చెంప మీద కొట్టి, దుర్భాషలాడుతూ అతని మొబైల్ ను కూడా నేలకేసి కొట్టాడు. అయితే ఈ ఘటనను మొబైల్ లో షూట్ చేసిన మరో వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. దీంతో కలెక్టర్ రణబీర్ శర్మ ను ప్రభుత్వం విధుల నుండి తప్పించింది. నూతన కలెక్టర్ గా వేరొకరిని నియమించింది. తదుపరి ఈ ఘటనపై వివరణ ఇస్తూ కలెక్టర్ క్షమాపణ చెప్పారు.

సో….. అధికారం ఉంది కదా అని బాధ్యతా రహితంగా లేదా బజారు రౌడీల్లా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది నాయనలారా! చిన్నవారైనా …. పెద్దవారైనా ప్రభుత్వాధికారులూ ….. మీరున్నది ప్రజాసేవకేనని గుర్తుంచుకుని మెలగండయ్యా!

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి