జనవిజయంఅంతర్జాతీయంపడవ మునిగి 57మంది మృత్యువాత

పడవ మునిగి 57మంది మృత్యువాత

  • మధ్యదరా సముద్రంలో మరో ఘోరం

న్యూఢల్లీ,మే19(జనవిజయం): మధ్యదరా సముద్రంలో మరో ఘోరం జరిగింది. లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలస దారులు పడవ ట్యునీషియా వద్ద మునిగింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందారు. 33 మందిని అధికారులు రక్షించారు. ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్ళీ వలసులు ప్రారంభం అయ్యాయి. పరిమితికి మించి పడవలో వసదారులు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా ఖండం విూదుగా ఐరోపా ఖండానికి వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బంగ్లాదేశీయులని అధికారులు పేర్కొన్నారు. వలసపోతున్న వారితో వెళుతున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగి 57 మంది మృతి చెందారు. మరో 33 మందిని రక్షించినట్లు ట్యునీషియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్‌ సంస్థ తెలిపింది. లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారులు పడవ వెళ్తుండగా ట్యునీషియా తీరం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ట్యునిషియా తీరంలో పడలు మునిగిన సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున ట్యునీషియా, లిబియా నుంచి యూరప్‌ వైపు వలసలు పెరిగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని.. 33 మంది ప్రాణాలతో బయటపడగా.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్‌ క్రెసెంట్‌ అధికారి మొంగి స్లిమ్‌ పేర్కొన్నారు. ఘటనలో 57 మంది మృతి చెందారని భద్రతా వర్గాలు నిర్దారించాయి. ట్యునీషియా తీరంలో పడలు మునిగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందికి పైగా వలసదారులు మరణించారు. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం విూదుగా వలస వచ్చారని.. చాలా మంది కొత్తగా ఇటలీ, స్పెయిన్‌కు ట్యునీషియా, అల్జీరియా నుంచి వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది మృతి చెందారని, గల్లంతయ్యారని ఏజెన్సీ అంచనా వేసింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి