జనవిజయంతెలంగాణఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ అందించిన పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐ.ఎఫ్.ఏ)

ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ అందించిన పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐ.ఎఫ్.ఏ)

ఖమ్మం,జూన్2(జనవిజయం): కరోనా బాధితులను కాపాడేందుకు ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే దృక్పదంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్సను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీసు పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పతాకావిష్కరణ అనంతరం పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐ.ఎఫ్.ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన 250 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ కు మంత్రి అందించారు. ఇట్టి కాన్సెంట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఆక్సిజన్ అవసరం అయిన వారికి వినియోగించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మంత్రి సూచించారు. కోవిడ్ చికిత్సపొంది కోలుకున్న వారికి కూడా ఇంటివద్ద అవసరమైన యెడల ఇట్టి అక్సిజన్ కాన్సన్ ట్రెటర్ను అందిస్తామని, వారి అవసరాల అనంతరం మరోకరికి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగరపోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్, నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూథన్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, డిప్యూటీ మేయర్ యస్.కె.ఫాతిమా జోహార్, తహశీల్దారు శైలజ, స్థానిక ప్రజా ప్రతినిధిలు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి