జనవిజయంసినిమాఒత్తిడిని జయించే కసరత్తులు అవసరమంటున్న రకుల్‌

ఒత్తిడిని జయించే కసరత్తులు అవసరమంటున్న రకుల్‌

త్తిడితో కూడిన నేటి బిజీలైఫ్‌లో మనసుకు ఆహ్లాదాన్ని పంచే వ్యాపకాల కోసం సమయాన్ని కేటాయించాలని చెబుతోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. కోరుకున్న ఆనందాన్నీ పొందగలిగినప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని అంటోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోంది. బిజీలైఫ్‌ కారణంగా ఎదురయ్యే ఒత్తిడుల నుంచి ఎలా దూరమవుతారని అడగ్గా స్కూబా డైవింగ్‌, ట్రెక్కింగ్‌ లాంటి సాహసాలతో మానసికోల్లాసాన్ని పొందుతానని బదులిచ్చింది రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాల కోసం సమయాన్ని కేటాయించే అవకాశం తారలకు అరుదుగా దొరుకుతుంది. అలా దొరికే కొద్ది పాటి టైమ్‌ను వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. షూటింగ్‌ నుంచి విరామం దొరకడమే ఆలస్యం స్కై డైవింగ్‌, స్కూబా డైవింగ్‌ లాంటి సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొంటా. లేదంటే జనజీవనానికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌, మెడిటేషన్‌లతో సేదతీరుతా. నచ్చిన ఆటలు ఆడుతుంటా. అవే నాలోని ఒత్తిడిని దూరం చేయడానికి ఉపకరిస్తాయి. మనసుకు సాంత్వన చేకూర్చే అంశాలేమిటో తెలుసుకోవడం ముఖ్యం. కఠిన సమయాల్లో మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఆ వ్యాపకాలు ఉపయోగపడతాయి అని తెలిపింది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ బాలీవుడ్‌లో ఎటాక్‌, మేడే, థాంక్‌ గాడ్‌లతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి