జనవిజయంఆంధ్రప్రదేశ్ఒకే ఒక్కడు.... ఎప్పటికీ ‘రారాజు’

ఒకే ఒక్కడు…. ఎప్పటికీ ‘రారాజు’

  • అటుసినిమా రంగం..ఇటు రాజకీయ రంగం
  • చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్
  • అన్నగా గుర్తుండి పోయిన తెలుగు నేత

హైదరాబాద్,మే27(జనవిజయం): తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహానటుడు, ఆధునిక సామాజికవేత్త నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే పాతికేళ్లు దాటింది. అయినా నేటికీ ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉమ్మడి ఎపిలో ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి, 9నెలల స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించారు. ఆనాటి రాజకీయాల్లో ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. ఇక చిత్రసీమలోనూ ఎందరికో చేయూతనిచ్చి ఆదుకున్నారు. అందుకే ఈ నాటికీ రామారావు జనం మదిలో అన్నగా కొలువై ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్ అదే తీరున సాగడం విశేషం. యన్టీఆర్ ఓ సారి నమ్మితే వారి కోసం ప్రాణమిస్తారని ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య తరచూ చెప్పేవారు.

యన్టీఆర్ విజయవాడలో చదువుకొనే రోజుల్లో ఇద్దరూ కలసి నాటకాలు వేశారు. తాను సినిమా రంగంలో అడుగుపెట్టగానే, తన తమ్ముడు త్రివిక్రమరావును, పుండరీకాక్షయ్యను మదరాను పిలిపించుకొని వారిద్దరినీ భాగస్వాములుగా చేసి ఎన్.ఏ.టి. సంస్థపై చిత్రాలను నిర్మించారు… ఆ తరువాత పుండరీకాక్షయ్యను సోలో ప్రొడ్యూసర్ గానూ చేశారు. రామారావుతో పుండరీకాక్షయ్య ‘శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, ఆరాధన’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. మరో ఇద్దరు నిర్మాతలు సిహెచ్. రాఘవరావు, కె.బసవయ్యతో కలిపి నాగభూషణంను నిర్మాతగా నిలిపి, నష్టాలు రాకుండా మరీ జాగ్రత్తలు తీసుకున్నారు… అదే ‘ఒకే కుటుంబం’ చిత్రం…. అలాగే తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన సత్యనారాయణకూ ‘గజదొంగ కు కాల్ షీట్స్ ఇచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు… ఇక యన్టీఆర్ తో ‘సంసారం, దాసి’ చిత్రాల్లో నాయికగా నటించిన లక్ష్మీరాజ్యం అడగ్గానే నర్తనశాల’లో అర్జున, బృహన్నల పాత్రల్లో అభినయించి అలరించిన తీరును ఎవరు మాత్రం మరచి పోగలరు? తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన ‘మగాడు’లోనూ యన్టీఆర్ నటించారు. అలాగే తనతో పలు చిత్రాల్లో నటించిన భానుమతి సొంత చిత్రాల్లో నటించారు రామారావు. యన్టీఆర్ ‘తాతమ్మకల’లో నటించినందుకు భానుమతి కోరగానే ఆమెకు కాల్ సీట్స్ ఇచ్చారు… యన్టీఆర్ వంటి సూపర్ స్టార్ కాల్ షీట్స్ ఇచ్చినా ‘అమ్మాయి పెళ్ళి’ అనే సాధారణ చిత్రం తీశారు భానుమతి. తన ప్లలెటూరు’తోనే నాయికగా పరిచయమైన సావిత్రి దర్శకత్వం వహించిన ‘మాతృదేవతలో నటించి, ఆమెను డైరెక్టర్ గా ప్రోత్సహించారు. సావిత్రి దర్శకత్వంలో రూపొందిన మూడు చిత్రాల్లో సక్సెస్ సాధించిన ఏకైక సినిమా ‘మాతృదేవత’ కావడం గమనార్హం!

ఎన్టీఆర్ కు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవం. తన మేకప్ మేన్ పీతాంబరంను నిర్మాతగా నిలిపేందుకు అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్’ చిత్రాల్లో నటించి ఆదుకున్నారు. అదే పీతాంబరం నిర్మించిన ‘సాహసమే జీవితం’తోనే తన నటవారసుడు బాలకృష్ణను సోలో హీరోగానూ పరిచయం చేశారు… ఇలా పీతాంబరం ను యన్టీఆర్ ఆదుకున్న వైనాన్ని పీతాంబరం తనయుడు ప్రముఖ దర్శకుడు పి.వాను ఎన్నో మార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కళాదర్శకుడు రాజేంద్రకుమార్ ను కూడా ‘మనుషులంతా ఒక్కటే’తో నిర్మాతను చేశారు. యన్టీఆర్ తో దానరి నారాయణరావు తీసిన తొలి చిత్రం ఇదే… ఈ సినిమా ఘనవిజయం సాధించింది… ఆ తరువాత రాజేంద్రకుమార్ కు ‘మహాపురుషుడు’ సినిమా కూడా చేసి పెట్టారు రామారావు. యమగోల’. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మళ్లీ వెంకటరత్నానికి కాల్ షీట్స్ ఇవ్వగా, అదే సమయంలో దేవీ వరప్రసాద్ కు కూడా డేట్స్ ఇచ్చి ఉండడంతో వారిద్దరినీ భాగస్వాములుగా చేసి నటించారు. అదే ‘నాదేశం’ చిత్రం. ఈ సినిమా యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో విడుదలై విజయదుందుభి మోగించింది. రెండు ప్లాపుల ఇచ్చినా, తన డైరెక్టర్ కు తమ సొంత చిత్రం ‘పాండురంగ మహాత్యం’కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు యన్టీఆర్… అది పెద్ద హిట్. ఆ తరువాత యన్టీఆర్-కె.కామేశ్వరరావు కాంబినేషన్ లో ఎన్నో మహత్తర పౌరాణిక చిత్రాలు వెలుగు చూశాయి. పద్మనాభం ఆ తరువాత యన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ అభిమానంతోనే పద్మనాభం తాను రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ కంపెనీ పెడుతున్నానని చెప్పగానే కాల్ షీట్స్ ఇచ్చారు రామారావు. అలా యన్టీఆర్ తో దేవత’ చిత్రం తీసి ఆ తరువాత మంచి నిర్మాతగా పేరు సంపాదించారు పద్మనాభం.

ఎన్టీఆర్ ను తొలిసారి శ్రీరాముని పాత్రలో చూపించిన చిత్రం ‘చరణదాసి…. అందులో ఓ సీక్వెన్స్ లో యన్టీఆర్ శ్రీరామునిగానూ, అంజలీదేవి సీతగానూ కనిపిస్తారు… ఆ చిత్ర నిర్మాత ఎ.శంకర్ రెడ్డి ఆ తరువాత యన్టీఆర్, అంజలీదేవితోనే ‘లవకుశ నిర్మించారు… ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా యన్టీఆర్ తన నిర్మాతకు అండగా నిలిచారు… ‘లవకుశ’ ఆల్ టైమ్ హిట్ గా నిలచింది. ఆ తర్వాత శంకర్ రెడ్డి కష్టాల్లో ఉంటే కాల్ షీట్స్ ఇవ్వగా యన్టీఆర్ తో ‘సతీ సావిత్రి తీశారు. తనతో ‘పరమానందయ్య శిష్యుల కథ తీసిన తోట నుబ్బారావును, మహామంత్రి తిమ్మరుసు’ నిర్మించిన ఎన్. రామబ్రహ్మంను ఆదుకున్నారు… యన్టీఆర్ తన సినిమాల ద్వారా, తన వారికి చేసిన సాయం గురించి ఈ నాటికీ చిత్రసీమలో చెప్పుకుంటూనే ఉన్నారు. అందుకే యన్టీఆర్ ఇంకా తెలుగువారి హృదయాల్లో కొలువై ఉన్నారు…

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి